గత రెండు వారాలుగా సరైన సినిమాలు లేక చప్పగా ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ ఆశలన్నీ గురు శుక్రవారాల మీదే ఉన్నాయి. ఎక్కువ ఎడ్జ్ స్కంద తీసుకున్న మాట వాస్తవమే కానీ హైప్ విషయంలో ట్రైలర్ పుణ్యమాని అది కూడా పోరాడుతున్న వైనం గమనిస్తున్నాం. నిన్నటి నుంచి రామ్, శ్రీలీలతో ఇంటర్వ్యూల పర్వం మొదలుపెట్టినా ఓపెనింగ్స్ కి ఇవి ఎంత మేరకు దోహద పడతాయో చూడాలి. నెగటివ్ ట్రోలింగ్ మధ్య నెట్టుకుంటూ వస్తున్న చంద్రముఖి 2 డ్యామేజ్ రిపేర్ కోసం వదిలిన కొత్త ట్రైలర్ పర్వాలేదనిపించింది. ఈ రెండు స్టార్ క్యాస్టింగ్ ఉన్నవి కాబట్టి పెద్దగా సమస్య లేదు.
కానీ పెదకాపు 1 విషయం అలా కాదు. విరాట్ కర్ణ కొత్త హీరో. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ట్రాక్ రికార్డు ఏమంత ఆశాజనకంగా లేదు. బ్రహ్మోత్సవం తర్వాత ఏళ్ళ తరబడి మాయమైపోయారు. నారప్ప బాగానే తీసినా అది మక్కికి మక్కి కలర్ జిరాక్స్. సో డైరెక్టర్ బ్రాండ్ పెద్దగా పని చేయడం లేదు. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్టులు ఎవరూ రాకపోవడంతో సాధారణ ప్రేక్షకులకు ఆ వేడుక అంతగా రిజిస్టర్ కాలేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య పెదకాపు 1కున్న సానుకూలాంశం ఒకటే. పోటీలో ఉన్న వాటికన్నా దీని ట్రైలరే కాస్త మెరుగ్గా, ఇంట్రస్టింగ్ అనిపించడం.
ఈ అవకాశాన్ని వాడుకోవడం కోసం పెదకాపు 1 ఎర్లీ ప్రీమియర్లను రెండు రోజుల ముందే ప్లాన్ చేసే ఆలోచనలో నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి ఉన్నట్టు ఫ్రెష్ అప్ డేట్. సెప్టెంబర్ 29 విడుదల కాబట్టి 27 సాయంత్రం హైదరాబాద్ తో సహా కొన్ని కీలక కేంద్రాల్లో స్పెషల్ షోలు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీని వల్ల టాక్ బయటికి వెళ్లినా కంటెంట్ మీద నమ్మకంతో రెడీ అయ్యారట. ఒకవేళ 28 వేస్తే స్కంద, చంద్రముఖి 2 ఊపులో వెనుకబడే అవకాశం ఉంది కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నారన్న మాట. బుకింగ్స్ గట్రా వీలైనంత త్వరగా మొదలుపెట్టే ఛాన్స్ ఉందని తెలిసింది.
This post was last modified on September 24, 2023 11:50 am
ఓ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ గా వెలుగొందిన రోహిత్ శర్మ, ఇప్పుడు తన బ్యాటింగ్ ఫామ్ కోల్పోయి తీవ్ర…
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, 104 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా, ప్రత్యేక…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా పక్షపాతం అన్నది కనిపించదు. చివరకు ఆ విషయం…
హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ…
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్‌కు అనుకున్న ఆ చిత్రం…
అధికారంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు సహజం. ఎంత బాగా పాలన చేశామని చెప్పుకొన్నా.. ఎంత విజన్తో దూసుకుపోతున్నామని చెప్పుకొన్నా.. ఎక్కడో…