ఎక్కడైనా చంద్రముఖి ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది జ్యోతిక పెర్ఫార్మన్స్. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ముందు తొణుకు బెణుకు లేకుండా సీన్ మొత్తాన్ని డామినేట్ చేస్తూ ఆవిడ పండించిన అభినయం ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. తాజాగా సీక్వెల్ విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాతో పాటు నెటిజెన్లు సైతం ఆమె నటన గురించి మరోసారి గుర్తుచేసుకుంటూ పోలికలకు రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ మిస్ అవుతున్న అంశం మరొకటి ఉంది. జ్యోతిక కన్నా ముందు అంతే ధీటుగా ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన మరో ఇద్దరి గురించి మర్చిపోకూడదు.
1993లో వచ్చిన మలయాళం మూవీ మణిచిత్రతజు. దర్శకుడు ఫాజిల్ (నాగార్జున కిల్లర్ డైరెక్టర్ – పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ తండ్రి). ఇదో క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. చాలా పరిమితంగా ఉండే కేరళ మార్కెట్ లో ఒక దెయ్యం సినిమా ఏడు కోట్లకు పైగా వసూలు చేయడం అప్పట్లో రికార్డు. ఇందులో చంద్రముఖిగా శోభన అద్భుతంగా అభినయించి అవార్డులు సైతం అందుకున్నారు. అయితే వెంటనే ఇతర భాషల్లో తీసే సాహసం ఎవరూ చేయలేదు. 2004లో పి వాసు కన్నడ హీరో విష్ణువర్థన్ హీరోగా ఆప్తమిత్ర పేరుతో రీమేక్ చేస్తే శాండల్ వుడ్ పాత రికార్డులు బద్దలయ్యాయి.
దీంట్లో దివంగత సౌందర్య ఒరిజినల్ లో నటించిన శోభనకు ఎంత మాత్రం తీసిపోని రీతిలో గొప్పగా పండించారు. ఆ మరుసటి ఏడాదే రజనీకాంత్ తో తమిళంలో తీసి అన్నింటిని మించిన విజయం సొంతం చేసుకున్నారు. సో జ్యోతిక కన్నా ముందు క్రెడిట్ నిస్సందేహంగా సౌందర్య, శోభనలకు దక్కుతుంది. ఎవరికి ఎవరు తీసిపోనంత రేంజ్ లో మెప్పించారు కాబట్టి ఐకానిక్ క్యారెక్టర్స్ గా మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు ఫ్రెష్ గా ఈ బ్యాచ్ లో కంగనా రౌనత్ వచ్చి చేరుతోంది కాబట్టి వాళ్ళ స్థాయిలో చేసిందో లేదో చూడాలి. సెప్టెంబర్ 28న చెప్పుకోదగ్గ స్థాయిలో చంద్రముఖి 2 రిలీజ్ జరగనుంది.
This post was last modified on September 23, 2023 10:28 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…