Movie News

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మంచు మనోజ్ ఒకవైపు కొత్త సినిమా చేస్తూనే మరోవైపు డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు. ఈటీవీ విన్ ఓటిటి కోసం నిర్వహించే సెలబ్రిటీ షో కోసం కొత్తగా మేకోవర్ చేసుకుంటున్నాడు.  దీనికి సంబంధించిన ప్రీ టీజర్ ఆల్రెడీ యూట్యూబ్ లో విడుదల చేశారు. ప్రోగ్రాం తాలూకు తీరుతెన్నులు చెప్పలేదు కానీ రెండు కుర్చీలు పెట్టడం ద్వారా ఇది టాక్ షో అనే సంకేతమైతే ఇచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యంలో ఇది రూపొందనుంది. గతంలో ఇదే ప్లాట్ ఫార్మ్ మీద వెన్నెల కిషోర్ తో చేసిన కార్యక్రమం అంతగా సక్సెస్ కాలేదు.

ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా గట్టి స్టార్ హీరోలనే పట్టుకొస్తున్నారు. అందులో భాగంగా మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో పూర్తయినట్టు తెలిసింది. తనకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో పాటు మనోజ్ తో ఉన్న స్నేహం వల్ల రవితేజ పెద్దగా ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. బాలయ్య ఆన్ స్టాపబుల్ షోతో పోలిక రాకుండా చాలా విభిన్నంగా డిజైన్ చేశారని అంటున్నారు. ర్యాంప్ ఆడిద్దాం టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు.

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను తట్టుకోవడం కోసం ఇలాంటి ప్లాన్లు వేస్తోంది. మొదలుపెట్టి సంవత్సరాలు అవుతున్నా ఈటీవీ విన్ కి జనంలో ఇంకా ప్రచారం లభించడం లేదు. ఒక పూర్తి స్థాయి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ గా గుర్తింపు రావడం లేదు. దాన్ని బలపరిచే క్రమంలో భాగంగానే మంచు మనోజ్ తో ఇలాంటి స్కెచ్ రెడీ చేశారు. ఎంత గ్యాప్ వచ్చినా ఇతని మీద ఫ్యాన్స్ లో ఇప్పటికీ మంచి కార్నర్ ఉంది. సరైన హిట్టు పడితే ఖచ్చితంగా ఆదరణ దక్కుతుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. పేరుకి తగ్గట్టు ర్యాంప్ ఆడిస్తే అదే చాలు. 

This post was last modified on September 23, 2023 10:29 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

59 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago