ఆర్టిస్టులకు పాత్రల విషయంలో పరిమితులేమీ ఉండవు. ఒక సినిమాలో ఓ హీరోకు హీరోయిన్‌గా నటించిన నటి.. ఇంకో సినిమాలో చెల్లెలిగా నటిస్తుంటుంది. అలాగే హీరోయిన్‌గా చేసిన వాళ్లే తల్లి పాత్రలో నటించిన సందర్భాలూ ఉన్నాయి. ‘సైరా’లో చిరుకు జోడీగా చేసిన నయనతార.. ‘గాడ్ ఫాదర్’లో చెల్లెలి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
ఐతే ఒక సినిమాలో తనకు కూతురిగా నటించిన అమ్మాయిని తర్వాత తనకు హీరోయిన్‌గా పెడితే నో అనేశాడట కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి. అతను విలన్ పాత్రలో నటించిన ‘ఉప్పెన’ చిత్రంలో కృతి శెట్టి కూతురిగా చేసిన సంగతి తెలిసిందే. ఈ అమ్మాయిని తర్వాత సేతుపతి తమిళంలో నటించే ఓ సినిమాకు హీరోయిన్‌గా ఎంపిక చేశాడట దర్శకుడు.
ఐతే హీరోయిన్ తనే అంటూ ఫొటో చూపించగానే సేతుపతి నో అనేశాడట. తన కూతురిగా చేసిన అమ్మాయితో తాను రొమాన్స్ చేయలేనని అతను తేల్చి చెప్పేశాడట. ఐతే సినిమాలో చేసిన పాత్రను ఇంత సీరియస్‌గా తీసుకోవడం ఏంటి అని సేతుపతిని అడిగితే.. అందుకు కారణం చెప్పాడు.
‘ఉప్పెన’ సినిమా క్లైమాక్స్ సీన్లో కృతి చాలా ఇబ్బంది పడుతుంటే.. తనకు నిజ జీవితంలో ఇంతే వయసున్న కూతురు ఉందని.. కాబట్టి నువ్వు కూడా నా కూతురి లాంటి దానివే అని సర్దిచెప్పానని.. తనను నిజంగా ఓ తండ్రిలా ఫీలై ఈ సీన్ పూర్తి చేయమని అనడంతో ఆమె టెన్షన్ వదిలిపెట్టి ఆ సీన్ చేసిందని సేతుపతి వెల్లడించాడు. తాను కూడా కృతిని నిజంగా తన కూతురి లాగే ఫీలయ్యానని.. అందుకే ఆమె హీరోయిన్‌గా వద్దని తేల్చి చెప్పేశానని.. దీంతో తన స్థానంలో వేరే అమ్మాయిని తీసుకున్నారని సేతుపతి తెలిపాడు.
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…