ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. అలా అని ఆయన తనను ఇండస్ట్రీలో నిలబెట్టిన డిస్ట్రిబ్యూషన్‌ను ఏ రోజూ వదులుకోలేదు. ఓవైపు సొంత ప్రొడక్షన్లో తెరకెక్కే సినిమాల వ్యవహారాలు చూసుకుంటూనే.. ఇంకోవైపు డిస్ట్రిబ్యూషన్లోనూ తీరిక లేకుండా ఉన్నారు. టాలీవుడ్లో మంచి క్రేజున్న ఓ పెద్ద సినిమా రిలీజవుతోందంటే.. అందులో దిల్ రాజు హ్యాండ్ ఉండాల్సిందే.
అలా ఆయన గుడ్డిగా ఏమీ రైట్స్ కొనరు. మరీ రిస్క్ అనుకున్న సినిమాల జోలికి వెళ్లరు. కొన్ని సినిమాల మీద అంచనాలను మించి పెట్టుబడి పెడతారు. కానీ రిజల్ట్ చూశాక దిల్ రాజు జడ్జిమెంటే వేరు అని ఇండస్ట్రీ జనాలు ఆయన్ని కొనియాడతారు. ఇప్పుడు రాజు ఓ హిందీ చిత్రాన్ని తెలుగులో అందించబోతున్నారు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొత్త చిత్రం ‘యానిమల్’ తెలుగు హక్కులను రాజే తీసుకున్నట్లు సమాచారం.
‘యానిమల్’ బాలీవుడ్ మూవీనే అయినప్పటికీ.. వేరే హిందీ చిత్రాలు వేటికీ లేనంత క్రేజ్ తెలుగులో దీనికి ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ రెడ్డికి ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. కానీ అతను ఇక్కడ సినిమా తీయకుండా బాలీవుడ్‌కు వెళ్లిపోయాడు. ‘కబీర్ సింగ్’ పేరుతో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తీశాడు. ఆపై అతడి కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా ‘యానిమల్’యే.
రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం మంచి డిమాండే ఏర్పడింది కానీ.. రాజు మంచి రేటు పెట్టి కొనేశారు. దిల్ రాజు రిలీజ్ అంటే నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీనే. సినిమాను బాగా ప్రమోట్ చేస్తాడు. అలాగే రిలీజ్ పెద్ద రేంజిలో ఉంటుంది. వేరే ఏ రకమైన ఇబ్బందులూ లేకుండా చూసుకుంటాడు. సినిమా రీచ్ పెరుగుతుంది.
This post was last modified on September 23, 2023 12:44 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…