ప్రవీణ్ సత్తారు.. ఈ పేరు పెద్దగా పాపులర్ కానంత వరకు మంచి మంచి సినిమాలే తీశాడు. ‘ఎల్బీడబ్ల్యూ’ అనే ఇండిపెండెంట్ మూవీ అతడికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘చందమామ కథలు’ మూవీ సైతం ఆకట్టుకుంది. రొటీన్ లవ్ స్టోరీ, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలు కూడా విభిన్నమైన ప్రయత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇక ‘గరుడవేగ’తో అతను దర్శకుడిగా ఎన్నో మెట్లు ఎక్కాడు.
ఔట్ డేట్ అయిపోయిన సీనియర్ హీరో రాజశేఖర్‌ను పెట్టి ఆయనకు మంచి సక్సెస్ అందించడమే కాక.. ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని పంచాడు. ఆ సినిమా చూశాక ప్రవీణ్ సత్తారులో అసలు సత్తా ఏంటో అందరికీ తెలిసింది. దీంతో పెద్ద పెద్ద అవకాశాలు రావడం మొదలైంది. పుల్లెల గోపీచంద్ బయోపిక్ మీద కొంత కాలం పని చేసి బయటికి వచ్చేశాక అక్కినేని నాగార్జునతో అతను ‘ది ఘోస్ట్’ లాంటి పెద్ద సినిమా చేశాడు.
నాగ్-ప్రవీణ్ కాంబినేషన్ మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ‘గరుడవేగ’ మ్యాజిక్‌ను అతను రిపీట్ చేయలేకపోయాడు. దీని తర్వాత ‘గాండీవధారి అర్జున’ అంటూ మరో పెద్ద బడ్జెట్ సినిమా తీశాడు. కానీ ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ‘గరుడవేగ’ను అంత పకడ్బందీగా తీసిన ప్రవీణ్.. ఈ రెండు చిత్రాలను డీల్ చేసిన విధానం చూసి ప్రేక్షకులు షాకయ్యారు. ‘గాండీవధారి’ షాక్ నుంచి తేరుకునేలోపు.. ప్రవీణ్ నిర్మాతగా ‘అతిథి’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. వేణు తొట్టెంపూడి ఇందులో లీడ్ రోల్ చేశాడు.
ఈ వెబ్ సిరీస్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. రొటీన్ హార్రర్ అంశాలతో ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. వేణు పెర్ఫామెన్స్, చివర్లో వచ్చే కొన్ని ట్విస్టులు మినహాయిస్తే ఈ సిరీస్‌లో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవని ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. ప్రవీణ్ నిర్మాత అంటే మంచి థ్రిల్లింగ్ గా ఉంటుందని అనుకుంటే.. తన మార్కు అంటూ ఏమీ కనిపించట్లేదని.. తన మీద అంచనాలు పెట్టుకున్నప్పటి నుంచి అతను స్థాయికి తగ్గ కంటెంట్ ఇవ్వట్లదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ దశ నుంచి ప్రవీణ్ ఎలా పుంజుకుంటాడో చూడాలి.
This post was last modified on September 22, 2023 11:19 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…