Movie News

బన్నీని నమ్మలేం బాసూ..

అల్లు అర్జున్‌తో జైలర్ డైరెక్టర్?.. రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ హెడ్డింగ్‌తో ఎన్నో వార్తలు.. పోస్టులు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజినీకి ‘జైలర్’తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన నెల్సన్ దిలీప్‌కుమార్ కన్ను టాలీవుడ్ మీద పడిందని.. అతను అల్లు అర్జున్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశాడని.. ఇద్దరికీ కథలు చెప్పాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. బన్నీతో నెల్సన్ ప్రాజెక్ట్ ఓకే కావచ్చని.. కాకపోతే బన్నీ అందుబాటులోకి రావడానికి కొంచెం టైం పడుతుందని అంటున్నారు.

ఐతే బన్నీ ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ విషయమై ఎగ్జైట్ అవుతున్నప్పటికీ.. బన్నీ వ్యవహారం తెలిసిన వాళ్లు మాత్రం సినిమా మొదలైనపుడు చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు. అందుక్కారణం.. బన్నీ ఇలా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో సంప్రదింపులు జరపడం.. తర్వాత ఆ ప్రాజెక్టులు అటకెక్కేయడం కొత్తేమీ కాదు. లింగుస్వామితో కొన్నేళ్ల పాటు చర్చలు జరపడం.. చివరికి సినిమాను అనౌన్స్ చేశాక అది కార్యరూపం దాల్చకుండా మరుగున పడిపోవడం తెలిసిందే. బన్నీతో డిస్కషన్లు మొదలుపెట్టే సమయానికి లింగుస్వామి మంచి ఫాంలోనే ఉన్నాడు.

కానీ తర్వాత గాడి తప్పాడు. దీంతో బన్నీ కూడా వెనక్కి తగ్గాడు. అలాగే మురుగదాస్ మంచి ఫాంలో ఉండగా బన్నీతో డిస్కషన్లు జరిగాయి. కానీ తర్వాత ఈ కాంబినేషన్ ఏమైందో తెలియలేదు. మురుగతో బన్నీ జట్టు కట్టే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. మరోవైపు తమిళ దర్శకుడే అయినప్పటికీ తెలుగులో ఎక్కువగా సినిమాలు చేసిన విక్రమ్ కుమార్‌తోనూ కొంత కాలం ట్రావెల్ చేశాక హ్యాండిచ్చాడు బన్నీ. మధ్యలో లోకేష్ కనకరాజ్‌తో బన్నీ అంటూ ఒక ప్రచారం జరిగింది. నిజంగా వారి మధ్య చర్చలు జరిగాయో లేదో తెలియదు కానీ.. ఈ ప్రాజెక్ట్ సమీప భవిష్యత్తులో ఉండేలా కనిపించడం లేదు.

టాలీవుడ్లో కూడా వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ మీద వర్క్ చేసి సినిమా అనౌన్స్ చేశాక అది అడ్రస్ లేకుండా పోయింది. బన్నీ కథల విషయంలో రాజీ పడడని.. ఒక పట్టాన ఓకే చేయడని.. ఇది తన తండ్రి అల్లు అరవింద్ నుంచి అబ్బిన లక్షణమని.. ఇలా జాగ్రత్తగా వ్యవహరించడం, మంచి జడ్జిమెంట్ ఉండటం వల్లే మిగతా స్టార్లతో పోలిస్తే తన సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉందని.. చర్చల్లో ఉన్న కాంబినేషన్లు కార్యరూపం దాల్చకపోవడం అభిమానులకు నిరాశ కలిగించినా.. తన నుంచి ఉత్తమమైన సినిమాలు ఇవ్వడానికే బన్నీ ప్రయత్నమంతా అని తనను అర్థం చేసుకున్న వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on September 21, 2023 9:47 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

16 minutes ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

1 hour ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

2 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

3 hours ago