కూల్ సురేష్.. తమిళనాడులో ఈ పేరు బాగా పాపులర్. యూట్యూబర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. అక్కడ మంచి పాపులారిటీ సంపాదించాక నటుడిగా మారాడీ వ్యక్తి. ఈ మధ్య తమిళ చిత్రాల్లో కామెడీ రోల్స్ బాగానే వస్తున్నాయి ఈ నటుడికి. ఐతే ప్రస్తుతం చిన్న సినిమాలు అంత ఈజీగా జనాల దృష్టిలో పడట్లేదన్న సంగతి తెలిసిందే. ఏదో ఒక కాంట్రవర్శీ క్రియేట్ అయితే తప్ప వాటి గురించి జనాలు పట్టించుకోవట్లేదు.
ఈ నేపథ్యంలోనే తాను నటించిన ఓ చిన్న సినిమా వేడుకలో కూల్ సురేష్ చేసిన అతి తీవ్ర విమర్శలకు దారి తీసింది. అతను స్టేజ్ మీద ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ.. మధ్యలో యాంకర్ గురించి ప్రస్తావించి.. వాళ్లను కూడా మనం గౌరవించుకోవాలి అంటూ పక్కనున్న పూలదండ తీసి ఆమెకు వేసేశాడు. ఈ హఠాత్పరిణామానికి ఆ యాంకర్ తీవ్ర అసహనానికి గురైంది. వెంటనే మాల తీసి కింద పడేసింది.
యాంకర్ కదా అని నవ్వుతూ ఈ విషయాన్ని కవర్ చేయకుండా ఆమె కూల్ సురేష్ వైపు చూస్తూ తిట్టడం మొదలుపెట్టింది. అంతే కాక ఆ తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కూల్ సురేష్ మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. తర్వాత యాంకర్ వైపు తిరిగి కోపం వచ్చిందా అని నవ్వుతూ ప్రశ్నించాడు. యాంకర్ ముఖంలో రంగులు మారిపోవడం చూసిన కూల్ సురేష్ తర్వాత టాపిక్ మార్చాడు.
ఐతే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ తర్వాత మైక్ అందుకుని యాంకర్‌కు సారీ చెప్పాడు. అంతే కాక కూల్ సురేష్‌ను కూడా సారీ చెప్పమనడంతో అతను కూడా క్షమించమని అడిగాడు. అంతే కాక తాను ఇదంతా పబ్లిసిటీ కోసమే చేశానని అన్నాడు. ఐతే కూల్ సురేష్ తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ కోసం చేసినా కూడా ఇంత అవసరం లేదని.. ఇలాంటి నటులను పరిశ్రమ ప్రోత్సహించకూడదని ట్వీట్లు వేస్తున్నారు.
This post was last modified on September 20, 2023 6:15 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…