తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా ఎంత దుమారం రేపిందో తెలిసిందే. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అనేకమంది జాతీయ నాయకులు స్టేట్మెంట్స్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లో సైతం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి. ఐతే సినీ పరిశ్రమ నుంచి బాబు అరెస్ట్ మీద సరైన స్పందన లేదనే చర్చ నడుస్తోంది.
సినీ పరిశ్రమకు చంద్రబాబు చేసినంత మేలు ఇంకెవరూ చేయలేదనే అభిప్రాయాలున్నాయి. కానీ ఆయన అరెస్ట్ మీద అశ్వినీదత్, కేఎస్ రామారావు లాంటి కొద్ది మంది మాత్రమే స్పందించారు. చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్న, ఆయన వల్ల మేళ్లు పొందిన చాలామంది సైలెంట్‌గా ఉండటం మీద టీడీపీ వాళ్లు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత సురేష్ బాబుకు ‘సప్తసాగరాలు దాటి’ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్లో మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
చంద్రబాబు అరెస్ట్‌పై ఇండస్ట్రీ నుంచి చాలామంది ఎందుకు స్పందించట్లేదని అడిగితే సురేష్ బాబు ఆసక్తికర రీతిలో స్పందించారు. ‘‘సినీ పరిశ్రమ రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు. అసలు మేమెందుకు స్టేట్మెంట్స్ ఇవ్వాలి? మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేం రాజకీయ నాయకులం కాదు. సామాన్య ప్రజలమూ కాదు. మేం సినిమా వాళ్లం. మేం వచ్చింది సినిమాకు సంబంధించిన ఈవెంట్‌కు. ఇక్కడ రాజకీయాల ప్రస్తావన ఎందుకు? అసలు మనకెందుకు రాజకీయాలు? మా నాన్న తెలుగుదేశం ఎంపీగా పని చేశారు.
నేను కూడా టీడీపీ కోసం పని చేశాను. కానీ అది మా వ్యక్తిగతం. సురేష్ బాబుగా నేను ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు. దేన్నయినా ఖండించవచ్చు. కానీ పరిశ్రమ ప్రతినిధిగా మాత్రం రాజకీయాలపై మాట్లాడను. నేనే కాదు ఇంకెవరూ కూడా పరిశ్రమ తరఫు నుంచి రాజకీయాలపై స్టేట్మెంట్స్ ఇవ్వం. వ్యక్తిగతంగా ఎవరికి ఏ అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ పరిశ్రమ వేరు. సినీ పరిశ్రమకు చంద్రబాబు గారు మంచి చేశారు. ఆయనే కాదు.. ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు.. ఇలా చాలామంది మంచి చేశారు” అని సురేష్ బాబు అన్నారు.
This post was last modified on September 19, 2023 2:02 pm
టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం…
మొన్న శుక్రవారం కోర్ట్ హడావిడిలో పడి వేరే కొత్త సినిమాలు పట్టించుకోలేదు కానీ వాటిలో మలయాళం డబ్బింగ్ 'ఆఫీసర్ ఆన్…
సోషల్ మీడియాలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.…
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తమిళనాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వరుస పెట్టి విమర్శలు…
మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్ప కోసం మంచు విష్ణు ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూలతో పాటు…