నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘భగవంత్’ కేసరి విడుదలకు సరిగ్గా నెల రోజులే సమయం ఉంది. దసరా కానుకగా వచ్చే నెల 19న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలూ లేవు. కానీ ఉన్నట్లుండి షూటింగ్‌కు బ్రేక్ పడటం.. తన బావ, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్‌గా బాలయ్య బ్రేక్ తీసుకోవడం.. బాబు లేని సమయంలో కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బ తినకుండా కొన్ని రోజులు తనే పార్టీని ముందుకు నడిపించాలని భావించడంతో ‘భగవంత్ కేసరి’ దసరాకు వస్తుందా రాదా అన్న సందేహాలు నెలకొన్నాయి.
ఇంకా బాలయ్యతో పది రోజుల దాకా చిత్రీకరణ ఉండటంతో సమయానికి షూట్ పూర్తి చేసి.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసి సినిమాను అనుకున్న ప్రకారం రిలీజ్ చేయగలరా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఐతే మూణ్నాలుగు రోజులు పార్టీ కోసం కేటాయించిన బాలయ్య.. మళ్లీ అక్కడ్నుంచి బ్రేక్ తీసుకుని ‘భగవంత్ కేసరి’ షూట్‌కు హాజరవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఫ్లాష్ బ్యాక్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు బాలయ్య. సినిమాలో ఈ సన్నివేశాలు కీలకంగా ఉంటాయట.
వీలైతే ఈ షెడ్యూల్లోనే తన వర్క్ అంతా పూర్తి చేయాలని.. లేదంటే మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని పార్టీ కోసం కొన్ని రోజులు కేటాయించిన తర్వాత బాలయ్య తిరిగి వస్తాడని అంటున్నారు. ఏదేమైనా ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని అనుకుంటున్నారు. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. విడుదలకు వారం ముందే ఫస్ట్ కాపీ రెడీ చేసేలా ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి దసరాకు ‘భగవంత్ కేసరి’ రాదేమో అన్న సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఐతే బాబీ దర్శకత్వంలో బాలయ్య చేయాల్సిన సినిమాను మాత్రం అనుకున్న సమయానికి మొదలుపెట్టడం కష్టమేనట.
This post was last modified on September 18, 2023 2:14 pm
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…