సౌత్ ఇండియాలో ఇమేజ్ గురించి ఆలోచించకుండా ఎలాంటి పాత్రనైనా చేసుకుపోయే కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. గత ఏడాది ఆమె ‘సర్కారు వారి పాట’ చిత్రంలో పక్కా గ్లామర్ రోల్ చేసింది. ఆ సినిమా రిలీజ్ కావడానికి ఒక్క రోజు ముందు ‘సాని కాయిదం’ అనే సినిమాలో అత్యాచారానికి గురై ప్రతీకారం తీర్చుకునే వయొలెంట్ క్యారెక్టర్లో కనిపించింది. బేసిగ్గా పెద్ద సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్లు అలాంటి పాత్రలు చేయడానికి ఏమాత్రం సాహసించరు.
కానీ కీర్తి మాత్రం తాను అందరిలా కాదని రుజువు చేసింది. ‘పెంగ్విన్’ సినిమా మొత్తం గర్భవతిగా కనిపించినా.. ‘మరక్కార్’ ఒక పర దేశీయుడిని ప్రేమించే అమ్మాయిగా నటించినా కీర్తికే చెల్లింది. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పే కీర్తి.. సీనియర్ హీరోల సరసన చెల్లెలి పాత్రలకు కూడా ఓకే చెప్పింది. ఆ క్రమంలో వచ్చినవే.. ‘అన్నాత్తె’, ‘భోళా శంకర్’.
రజినీకాంత్ లాంటి లెజెండరీ స్టార్‌కు కీర్తి చెల్లెలిగా నటించిన ‘అన్నాత్తె’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. సూపర్ స్టార్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘అన్నాత్తె’. ఈ సినిమా రిలీజ్‌కు ముందు కీర్తి ఎంతో ఎగ్జైటెడ్‌గా కనిపించింది. సినిమా రిలీజయ్యాక దీని గురించి మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత చిరు చెల్లెలిగా ‘భోళాశంకర్’ చేసే అవకాశం వస్తే దీనికీ ఆమె ఎగ్జైట్ అయింది. విడుదల ముంగిట ప్రమోషన్లలో ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే పరిస్థితి. కీర్తి సైలెంట్ అయిపోయింది. సూపర్ స్టార్, మెగాస్టార్‌లతో చేసిన సినిమాలు మధు జ్ఞాపకాలుగా మిగులుతాయనుకుంటే.. అవి చేదు గురుతులుగా మారాయి. ఈ దెబ్బతో పెద్ద స్టార్ల సినిమాల్లో చెల్లెలి పాత్రలు అంటేనే కీర్తి భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ‘మహానటి’ తర్వాత చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో వాటికి విరామం ఇచ్చేసింది. ఇప్పుడు ఈ చెల్లెలి పాత్రలకు కూడా ఆమె నో చెబుతోందట. ఇకపై ఆ టైపు క్యారెక్టర్లను కీర్తి చేయడం డౌటే అంటున్నారు.
This post was last modified on September 18, 2023 1:13 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…