జవాన్ రూపంలో షారుఖ్ ఖాన్ కి తిరుగులేని బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అట్లీ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. ఒక సౌత్ డైరెక్టర్ వచ్చి తమ రికార్డులను పాతరేయడం పట్ల అక్కడి మేకర్స్ లోలోపల రగిలిపోతున్నా తీసింది తమవాడితోనే కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మసాలా క్రియేటర్ తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే గుట్టు మాత్రం విప్పడం లేదు. పలు హిందీ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశాడు అట్లీ. ఒకరకంగా చెప్పాలంటే అయోమయం సృష్టించాడు.
అట్లీ వెర్షన్ ప్రకారం తను అల్లు అర్జున్ తో టచ్ లో ఉన్న సంగతి వాస్తవమే. తరచుగా కలుసుకుంటూనే ఉన్నామని, దేవుడి దీవనెలు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుందని నర్మగర్భంగా అన్నాడు. ఇంకోవైపు జవాన్ 2 సీక్వెల్ తీస్తానని, షారుఖ్ ఖాన్ సైతం పూర్తి సంసిద్ధత వ్యక్తం చేశానని చెప్పాడు. అంతే కాదు తమిళ స్టార్ విజయ్ షారుఖ్ లను కలిపి ఒక సినిమా తీస్తే ఈజీగా పదిహేను వందల కోట్లు వసూలవుతాయని జోస్యం చెప్పాడు. అందుకే జవాన్ లో విజయ్ క్యామియో చేయించే ఆలోచన డ్రాప్ అయినట్టుగా అసలు విషయం చెప్పకుండా పైపై పూతలతో మమ అనిపించేశాడు.
ఇంతే కాదు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లకు లైన్లు వినిపించాడట. ఇన్నేసి ఆప్షన్లు ఉన్నా అట్లీ ఫైనల్ గా ఎవరితో లాక్ చేసుకుంటాడో తెలియాలంటే ఇంకో నాలుగు నెలలకు వరకు ఆగాల్సిందే. తమ తొలి సంతానం కోసం నాలుగు నెలల పాటు ఇంటి పట్టునే ఉండబోతున్నానని, ఆ తర్వాత బయటికి వచ్చి ఎవరితో చేయబోయేది వెల్లడిస్తానని చెప్పాడు. ఈ లెక్కన వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలోనే అట్లీ చేయబోయే హీరో తాలూకు క్లారిటీ వస్తుంది. పుష్ప తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో చేతులు కలిపిన బన్నీ ఒకవేళ అట్లీని కూడా లాక్ చేసుకుంటే అభిమానులకు అంతకన్నా పండగేముంది.
This post was last modified on September 17, 2023 1:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…