Movie News

మూగ సినిమాని థియేటర్లోనే ఎందుకు చూడాలంటే

సాధారణంగా కమర్షియల్ హీరోలు ప్రయోగాలు చేయడం అరుదు. కమల్ హాసన్ ఒక్కరే దానికి మినహాయింపు. అయితే ఇప్పటి ప్రేక్షకుల బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన గొప్ప క్లాసిక్స్ ని థియేటర్ లో చూసే అదృష్టం దక్కకపోవడం. అందుకే ఆ అనుభూతిని తిరిగి అందివ్వాలనే ఉద్దేశంతో పుష్పక విమానంని మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూకీ సినిమలో డైలాగ్స్ ఉండవు. కేవలం సైగల ద్వారా పాత్రలు మాట్లాడుకుంటూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా కథ అర్థమయ్యేలా గొప్పగా తీర్చిదిద్దారు.

యూట్యూబ్ లో ఉండగా ఇది టికెట్ కొని చూడాలానే ప్రశ్నకు సమాధానం ఉంది. ఈ మూవీ 1987లో కన్నడలో రూపొందింది. అక్కడ డబ్బింగ్ నిషేధం కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఆ భాషలో తీసి తమిళంలో పేసుం పదం, తెలుగులో పుష్పక విమానం, హిందీలో పుష్పక్ పేరుతో రిలీజ్ చేశారు. కమల్ హాసన్, అమల, టిను ఆనంద్, ప్రతాప్ పోతన్, పీఎల్ నారాయణ, శామీర్ కక్కర్ తదితరుల అద్భుత నటన కట్టిపడేసేలా ఉంటుంది. సౌండ్ కీలక పాత్ర పోషించే ఇలాంటి సైలెంట్ డ్రామాకు సంగీత దర్శకుడు ఎల్ వైద్యనాథన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశారు.

ఒక నిరుద్యోగి జీవితంలో జరిగే చిన్న సంఘటన చుట్టూ బ్లాక్ కామెడీని అల్లి రాసుకున్న స్క్రీన్ ప్లే కట్టిపడేసేలా ఉంటుంది. దీన్ని ఆస్వాదించాలంటే బిగ్ స్క్రీన్ అయితేనే కరెక్ట్. కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ మాసాలాలు లేకుండా ఒక క్లీన్ ఎంటర్ టైనర్ గా పుష్పక విమానంది చాలా ప్రత్యేక స్థానం. తర్వాత ఒకరిద్దరు ఇలాంటి సైలెంట్ ఎక్స్ పరిమెంట్లు చేశారు కానీ కనీసం పుష్పక విమానం దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. కేవలం 35 లక్షల్లో తీస్తే కోటి రూపాయలు పైగా వసూలు చేయడం అప్పట్లో రికార్డు. దీని తర్వాత ఎవర్ గ్రీన్ క్లాసిక్ నాయకుడుని రీ రిలీజ్ చేయాలని అభిమానుల డిమాండ్.

This post was last modified on September 17, 2023 11:37 am

Share

Recent Posts

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

1 hour ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

1 hour ago

ఆదర్శ కుటుంబం ఇంక ఆలస్యం చేయొద్దు

ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…

2 hours ago

`సెల్ఫీ ప్లీజ్`… అంటూ ముద్దు పెట్టేసింది!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న యువ‌త‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డిన విష‌యం…

2 hours ago

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

2 hours ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

3 hours ago