మొన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ పాట లీక్ ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో చూశాం. నిర్మాత దిల్ రాజు ఏకంగా క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీస్ డిపార్ట్ మెంట్ కి విన్నవించారు. తమన్ సైతం ఈ వ్యవహారం పట్ల చాలా బాధ పడినట్టుగా వ్యక్తపరిచిన ఒక ఆడియో వైరలవుతోంది. నమ్మిన వాళ్లే మోసం చేశారన్నట్టుగా అందులో ఉంది. అయితే నిజంగా తన గొంతేనా కాదానేది పక్కనపెడితే ఒక గ్రాండ్ స్కేల్ లో రిలీజ్ కావాల్సిన ఇలాంటి సాంగ్ ఇంత అన్యాయంగా బయటికి రావడం అభిమానులను కలవరపరిచింది.
సరే జరిగిందేదో జరిగిపోయింది దాన్నెలాగూ మార్చలేం కాని ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న నిర్మాతలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక లీకైన జరగండి జరగండి పాట లిరిక్స్ కి సంబంధించి ఆన్ లైన్ లో పెద్ద చర్చే జరుగుతోంది. రెండో లైన్ లో జాబిలమ్మా జాకెటేసుకుని వచ్చెనండీ పదాలు మరీ కామెడీగా ఉన్నాయని, అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందని కొందరు ఏకంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. రచయిత ఎవరనేది తెలియలేదు కానీ నిజానికక్కడ తప్పు బట్టడానికి ఏం లేదు. ఎందుకంటే జాబిలికి దుస్తులుంటాయని ఎక్కడా ఏ పుస్తకాల్లోనూ నిర్వచించలేదు.
అప్పుడెప్పుడో 1995 ఘరానా బుల్లోడులో చుక్కల్లో తళుకులా పాటలో జాకెట్లో జాబిల్లి అంటూ వేటూరి గారు రాయడం పట్ల ఇలాగే డిస్కషన్లు జరిగాయి. దానికాయన బదులిస్తూ ట్యూన్ కోసం అలా రాశానని, మాములుగా అయితే జాకెట్లో రెండు జాబిలులని రాసేవాడినని తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడదే తరహాలో జాబిలీ జాకెట్ వేసుకుని వచ్చెనండీ అంటూ పెట్టడం మళ్ళీ అదే తరహా హాట్ టాపిక్ కు దారి తీసింది. ఒరిజినల్ అఫీషియల్ సాంగ్ వచ్చాక దీని గురించి మరింత క్లారిటీ వస్తుంది కానీ ముందీ పని చేసిన దొంగెవరో వీలైనంత త్వరగా పట్టుకోవడం చాలా అవసరం.
This post was last modified on September 17, 2023 11:27 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…