మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట కాంబినేషన్ లో రూపొందబోయే మెగా 157కి సంబంధించిన హీరోయిన్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టు గట్టిగానే వినిపిస్తోంది. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈ ఫాంటసీ డ్రామా స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని ఇన్ సైడ్ టాక్. దీని కన్నా ముందు ప్లాన్ చేసుకున్న కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టి మళ్ళీ రీ వర్క్ చేయించే పనిలో ఉన్నారట. సీనియర్ హీరోలకు జోడీని సెట్ చేయడం పెద్ద సవాల్ గా మారుతున్న టైంలో చిరుకీ అదే సమస్య వస్తోంది. ఇప్పుడైతే అనుష్క వైపే మొగ్గు చూపుతున్నట్టు టాక్.
జంటగా చిరు అనుష్కలు సెట్ అవుతారానే డౌట్ కొందరు అభిమానుల్లో వస్తున్నా నిజానికది అవసరం లేదు. ఎందుకంటే ఫుల్ లెన్త్ చేయకపోయినా స్టాలిన్ లో ఈ ఇద్దరే ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆడిపాడారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి ఉండకపోతే ఈ కాంబో అప్పుడే వర్కౌట్ అయ్యేది కానీ గ్యాప్ వచ్చేసరికి ఫ్యాన్స్ కోరిక నెరవేరలేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఘనవిజయం సాధించినా సినిమాలు చేసే విషయంలో అనుష్క తొందరపడటం లేదు. ఒకప్పటిలా దూకుడు చూపించే పరిస్థితి లేదు కాబట్టి కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మెగా 157 పాత్ర రెగ్యులర్ గా ఉండదట.
ఆ కారణంగానే సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. పైగా యువి బ్యానర్ కాబట్టి తన గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రెగ్యులర్ గా గంతులేసే కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా చాల హుందాగా ఉండే దేవకన్య క్యారెక్టర్ నే వశిష్ట డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరిలో శ్రీదేవి స్ఫూర్తితోనే ఇది రాసుకున్నాడని సన్నిహితులు అంటున్నారు. అయితే ఖచ్చితంగా అనుష్కకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇది అఫీషియల్ న్యూస్ కాదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ ఒకవేళ వాస్తవమైతే మాత్రం అరుంధతి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇందులో చూడొచ్చు.
This post was last modified on September 17, 2023 8:42 am
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…