రెండు దశాబ్దాలకు పైగా నిర్మాణంలో ఉంటూ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు దిల్ రాజు. ఆయన సినిమాల రేంజ్, సక్సెస్ రేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాతగా గొప్ప ట్రాక్ రికార్డున్న రాజు.. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఏ హీరోతో, దర్శకుడితో సినిమా తీసినా మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది. అంతా ఆయన ప్లాన్ ప్రకారం నడుస్తుంది.
కానీ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాజు మొదలుపెట్టిన గేమ్ చేంజర్ మూవీ విషయంలో మాత్రం అలా జరగట్లేదు. మధ్యలో శంకర్ ఇండియన్-2ను కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి రావడంతో గేమ్ చేంజర్ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. షెడ్యూళ్లు అనుకున్నట్లు జరగలేదు. సినిమా ఎంతకీ పూర్తి కావడం లేదు. అసలు రిలీజ్ ఎప్పుడుంటుందో ఎవరికీ క్లారిటీ లేదు.
వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తూ ఇంత ఆలస్యం అయితే నిర్మాత పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. ఆర్థికంగా చాలా నష్టపోతూ.. మరోవైపు సినిమా రిలీజ్ ఎప్పుడు, అప్‌డేట్స్ ఎక్కడ అంటూ అభిమానుల నుంచి ప్రశ్నలు, విమర్శలు ఎదుర్కొంటూ రాజు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. అది చాలదని గేమ్ చేంజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి నెగెటివ్ విషయాలతో వార్తల్లో నిలుస్తోంది.
ఈ సినిమా నుంచి పాట లీక్ కావడం చర్చనీయాంశమైంది. ఆ పాట మీద విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో గేమ్ చేంజర్ టీం పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఇప్పటికే ఉన్న నెగెటివిటీ చాలదని.. కొత్తగా ఈ లీక్డ్ సాంగ్ మీద ట్రోలింగ్ నడుస్తుండటంతో దిల్ రాజుకు ఒళ్లు మండినట్లుంది. అందుకే లీక్ వీరులపై కేసు పెట్టే వరకు వెళ్లారు. మొత్తంగా క్రేజీ కాంబినేషన్లో మొదలైన సినిమాతో రాజు ఇంత ఇబ్బంది పడతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.
This post was last modified on September 17, 2023 8:30 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…