అతిలోకసుందరిగా సౌత్ నుంచి నార్త్ దాకా అశేష అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి వారసురాళ్లలో పెద్దమ్మాయి జాన్వీ కపూర్ ఆల్రెడీ హీరోయిన్ గా రాణిస్తోంది. టాప్ స్టార్ గా ఎదగకపోయినా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ని మెల్లగా దిద్దుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవరలో ఛాన్స్ కొట్టేసి దక్షిణాదిలో క్రేజీ ఆఫర్ తో పరిచయం కానుంది. ఇది ప్యాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగు తమిళంలో క్రమంగా ఆఫర్లు పెరుగుతున్నాయి. తాజాగా తన చెల్లెలు ఖుషి కపూర్ ని లాంచ్ చేసే పనులను వేగవంతం చేశారు తండ్రి కం నిర్మాత బోనీ కపూర్.
కోలీవుడ్ హీరో అథర్వా సరసన జోడిగా నటించేందుకు ఖుషి కపూర్ ఓకే చెప్పినట్టు చెన్నై టాక్. నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ఆకాష్ ని దర్శకుడిగా పరిచయం చేయబోయే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ద్వారా తెరంగేట్రం చేయించబోతున్నట్టు తెలిసింది. హీరో మీడియం రేంజ్ అయినా బడ్జెట్ సెటప్ రెండూ భారీగా ఉంటాయట. స్టార్ హీరోలు అడిగితేనే వెంటనే ఎస్ చెప్పలేని పరిస్థితిలో ఉన్న అనిరుద్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్టు తెలిసింది. ఈ లెక్కన బడ్జెట్ ఏదో ఆషామాషీగా ఉండదనే క్లారిటీ అయితే ఇచ్చేశారు.
ఇది అన్ని భాషల్లోను ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అథర్వా మనకు డబ్బింగ్ సినిమాలతో పరిచయం. వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ లో ఒక కీలక పాత్ర చేశాడు కానీ ఆ క్యారెక్టర్ అంతగా రిజిస్టర్ కాలేదు. రెగ్యులర్ గా ఓటిటి మూవీస్ చూసేవాళ్లకు మాత్రం తను సుపరిచితమే. టైటిల్ గట్రా ఇంకా లాక్ చేయలేదు. త్వరలోనే జరగబోయే ఓపెనింగ్ లో అన్ని వివరాలు వెల్లడిస్తాడు. ఖుషి కపూర్ హిందీలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సరసన లవ్ టుడే రీమేక్ చేసేందుకు ఒప్పుకుంది కానీ ముంబై మీడియా మాత్రం ఆ ప్రాజెక్టు క్యాన్సిలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటోంది.
This post was last modified on September 16, 2023 3:01 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…