ఏదో రీ రిలీజుల ట్రెండ్ నడుస్తోందని ఇష్టం వచ్చినట్టు పాత సినిమాలన్నీ రిలీజ్ చేసుకుంటూ పోతే దెబ్బ తినక తప్పదని పలుమార్లు ఋజువైనా సరే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ధోరణిలో మార్పు రావడం లేదు. లాటరీ తగలొచ్చనే రీతిలో సరైన ప్లానింగ్ లేకుండా డేట్ ఖాళీగా ఉందని హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుని జనం మీదకు వదిలేస్తున్నారు. నిన్న విజయ్ ఆంటోనీ బ్లాక్ బస్టర్ బిచ్చగాడుని తెలుగు రాష్ట్రాల్లో రీ పునః విడుదల చేశారు. చెప్పుకోదగ్గ స్క్రీన్ కౌంట్ తో సరిపడా షోలే వేశారు. ట్రాజెడీ ఏంటంటే ఎక్కడా బిచ్చగాడుకి కనీస స్థాయిలో స్పందన దక్కలేదు. ఆఖరికి స్పెషల్ షోలకు సైతం.
చాలా చోట్ల జనం లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి తలెత్తింది. బిచ్చగాడు బ్లాక్ బస్టరే. అందులో సందేహం లేదు. రిలీజైన టైంలో పాతిక కోట్లకు పైగా రాబట్టి వామ్మో అనిపించింది. కానీ ఇందులో ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకునే మెటీరియల్ ఉండదు. సూర్య సన్ అఫ్ కృష్ణన్, రఘువరన్ బిటెక్ లాగ ఈలలు, కేకలు వేసే పాటలు ఉండవు. ఎలివేషన్ సీన్లు, డైలాగులున్నాయి కానీ అవన్నీ తల్లి సెంటిమెంట్ కి సంబంధించినవే. అలాంటప్పుడు అదే పనిగా బిచ్చగాడు కోసం థియేటర్ రావడం జరగని పని. పైగా విజయ్ ఆంటోనీ మార్కెట్ బాగా తగ్గిపోయి సంవత్సరాలవుతోంది.
వచ్చే నెల విడుదల కాబోతున్న కొత్త సినిమా రత్తం మీద కనీస బజ్ లేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రీ రిలీజ్ విషయంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. హీరోకి స్టార్ ఇమేజ్ లేదా కంటెంట్ కి కల్ట్ స్టేటస్ ఉంటే తప్ప ట్రై చేయకూడదు. యూట్యూబ్, శాటిలైట్, ఓటిటిలో ఫ్రీగా దొరికే వాటిని నూటా యాభై రూపాయలు పెట్టి మళ్ళీ టికెట్ కొనేలా చేయాలంటే అది గతంలో హిట్ అయితే సరిపోదు. చాలా విషయాలు చెక్ చేసుకోవాలి. 22 రాబోయే 7జి బృందావన్ కాలనీకి కుర్రాళ్ళు ఎగబడతారు. ఎందుకంటే యూత్ ఎలిమెంట్స్, పాటలు ఆ స్థాయిలో ఉంటాయి కాబట్టి. ఏదైతేనేం మొత్తానికి బిచ్చగాడు పరువు తీసేశారు.
This post was last modified on September 16, 2023 12:47 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…
తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…
రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు…
వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి 12 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా…