నిన్న దుబాయ్ లో దక్షిణాది పరిశ్రమ నుంచి తరలి వచ్చిన తారా తోరణంతో సైమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ బాషల నుంచి వచ్చిన స్టార్లందరూ ఒకే చోట గుమికూడటంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికవుతారనే సస్పెన్స్ కు తెరదించుతూ జూనియర్ ఎన్టీఆర్ ని ప్రకటించడంతో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఈ విభాగంలో రామ్ చరణ్ తో పాటు ఇతరుల నుంచి పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ కొమరం భీంగా తారక్ చూపించిన టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ అందరినీ డామినేట్ చేసిందన్న విషయం అర్థమైపోయింది.
ఈవెంట్ కి చరణ్ హాజరు కాలేదు. విదేశీ ట్రిప్ తో పాటు షూటింగ్ కారణంగా రాలేనని ముందే చెప్పాడట. ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే బెస్ట్ యాక్టర్ ని సమంగా ఇచ్చేవాళ్ళో లేక తారక్ కే కట్టుబడే వారోనని సోషల్ మీడియా వేదికగా ఇద్దరు హీరోల అభిమానులు చర్చించుకుంటున్నారు. వీటి సంగతెలా ఉన్నా ఎలాంటి కమర్షియల్ అంశాలు లేని ఎమోషనల్ పాత్రను జూనియర్ రేంజ్ హీరో పోషించి మెప్పించడమంటే చిన్న విషయం కాదు. పలు ఇంటర్వ్యూలలో రాజమౌళి సమక్షంలోనే తామెంత కష్టపడిందో పంచుకున్న సంగతులు అంత సులభంగా మర్చిపోయేవి కాదు.
వేడుక లైవ్ లేకపోయినా ట్విట్టర్ వేదికగా నిర్వాహకులు ఫోటోలతో పాటు విజేతల వివరాలు ప్రకటించడంతో అప్డేట్ పరంగా లోటు రాలేదు. టాలీవుడ్ ప్రముఖులు చాలానే విచ్చేశారు. నిర్మాతలు, దర్శకులు ఆహ్వానితుల లిస్టు పెద్దదే ఉంది. అల్లు అరవింద్, అశ్వినిదత్, శ్రీలీల, బెల్లంకొండ గణేష్, సుధీర్ బాబు, సుశాంత్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, నిఖిల్, మంచు లక్ష్మి, చందూ మొండేటి, అనన్య నాగళ్ళ, ఛాయ్ బిస్కెట్ శరత్ – అనురాగ్, డివివి దానయ్య, చంద్రబోస్, రామ్ మిర్యాల తదితరులు ఉన్నారు. త్వరలోనే శాటిలైట్ టెలికాస్ట్ కూడా చేయబోతున్నారు.
This post was last modified on September 16, 2023 10:41 am
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…