Movie News

షాకింగ్ – గేమ్ ఛేంజర్ పాట లీక్?

వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసేటప్పుడు లీకుల విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా కంటెంట్ ఒక్కసారి బయటికి వచ్చిందంటే ఎంత కట్టడి చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ కు సంబంధించిన పాటగా ప్రచారంలోకి వచ్చిన ఒక హై క్వాలిటీ ఆడియో సాంగ్ ఆన్ లైన్ వేదికగా నానా రచ్చ చేస్తోంది. టీమ్ అలెర్ట్ అయిపోయి ఎక్కడిక్కడ డిలీట్ చేయిస్తున్నా అప్పటికే చాలా దూరం వెళ్లిపోయింది. ట్విట్టర్ హ్యాండిల్స్ ఈ వార్తతో హోరెత్తిపోతున్నాయి.

తమన్ కంపోజింగ్ లో జరగండి జరగండి అంటూ సాగే లిరిక్స్ తో ఉన్న ఈ పాట ముందు గుంటూరు కారమని ప్రచారం జరిగింది కానీ తర్వాత అది గేమ్ ఛేంజరనే సంగతి బయటికి వచ్చింది. అయినా చాలా జాగ్రత్తగా ఉండే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో ఇంత పెద్ద పొరపాటు జరగడం చిన్న విషయం కాదు. పైగా ఏదో స్పీకర్ నుంచి రికార్డు చేస్తే ఏదో అనుకోవచ్చు. క్వాలిటీ తగ్గకుండా లీక్ అయ్యిందంటే ఎవరో లోపలి వాళ్ళ హస్తమే ఉంటుంది. అసలు ఈ సినిమాకు ఇంకా సరైన ప్రమోషనే మొదలుకాలేదు. జస్ట్ ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ మాత్రమే జరిగాయి. ఈలోగా ఇది జరగడం అనూహ్యం.

దీని గురించి ఎస్విసి నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్ మెంట్ రాలేదు కానీ ఫాన్స్ మాత్రం ఈ పరిణామం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వీలైనంత త్వరగా ఇంటి దొంగను పట్టుకోవాలి. ఇంకా షూటింగ్ పూర్తి కాని నేపథ్యంలో విడుదల తేదీ ఇంకా ఖరారు కాని గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు 15 కోట్ల ఖర్చుతో షూట్ చేసిన పాట’కూడా ఇదేనని మరో టాక్ వినిపిస్తోంది.  టెక్నాలజీ ఎంత పెరిగితే అంత తలనెప్పి.

This post was last modified on September 16, 2023 7:59 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

6 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

7 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

7 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

8 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

8 hours ago