గణేశుడి చుట్టూ నేరగాళ్ల అట

బేబీ రూపంలో కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న ఆనంద్ దేవరకొండ నటన పరంగానూ గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాడు. మొన్నటి దాకా అన్న బ్రాండ్ వాడుకునే ఆఫర్లు వచ్చాయన్న కామెంట్లకు ధీటుగా బదులిస్తూ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇతని కొత్త సినిమా గం గం గణేశా. ఇది బేబీ తర్వాత ఒప్పుకున్నది కాదు.  సమాంతరంగా షూటింగ్ జరుపుకుంది. కాకపోతే బయటికి రావడానికి కొంత టైం పట్టింది. ఇవాళ హైదరాబాద్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు. వీడియో చిన్నదే అయినా కంటెంట్ ఏంటో వివరించే ప్రయత్నం చేశారు.

స్థిమితంగా ఒక పనంటూ చేయని యువకుడు(ఆనంద్ దేవరకొండ)కు ఊళ్లు తిరగడమే పని. చెడ్డోడు కాదు అలా అని మరీ మంచోడు అనలేం. అవసరాన్ని బట్టి మాటలు మార్చేస్తాడు. డబ్బు కోసం కిందామీదా పడుతున్న టైంలో రాజకీయం రౌడీయిజం చేసే ఒక నాయకుడు (రాజ్ అర్జున్) ఇతనికో డీల్ ఇస్తాడు. ముందు తేలిగ్గా తీసుకున్న ఆ కుర్రాడికి తాను చేయబోయే పనిలో ప్రమాదం ఉందని తెలియక ఒప్పుకుంటాడు. ఈ మొత్తం వ్యవహారానికి గణేష్ విగ్రహానికి ఒక కనెక్షన్ ఉంటుంది. అదేంటి, మనోడి లవ్ స్టోరీలో అసలు ట్విస్టు ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.

ఆనంద్ కొత్తగా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్ లోనూ వైవిధ్యం కనిపిస్తోంది. దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి ప్రెజెంటేషన్ వెరైటీగా ఉంది. ఇలాంటి కథలు ఎప్పుడు చూడనవి కాదు కానీ ట్రీట్ మెంట్ పరంగా మెప్పించేలా ఉంటే హిట్ అవుతాయని చాలాసార్లు ఋజువయ్యింది. ఆ కోణంలో ఆసక్తి రేపేలా గం గం గణేశాని తీర్చిదిద్దారు. ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా నటించగా వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ లాంటి సీనియర్లతో పాటు కొత్త మొహాలు చాలానే ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ సంగీతం ఫ్రెష్ గా ఉంది. ఆసక్తి రేపడంలో టీమ్ సక్సెసయ్యింది. విడుదల తేదీ త్వరలోనే ప్రకటించబోతున్నారు

Gam Gam Ganesha - Official Teaser | Anand Deverakonda, Pragati Srivastava,N Sarika | Uday Bommisetty