Movie News

రూపాయి తీసుకోకుండా నటించిన దీపికా

పది రోజులు దాటాక ముందే ఏడు వందల కోట్లకు దగ్గరగా వెళ్తున్న షారుఖ్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జవాన్ ఇప్పుడు కాస్త నెమ్మదించినా మళ్ళీ ఈ వీకెండ్ సత్తా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో దీపికా పదుకునే ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఎమోషన్ టచ్ ఎక్కువగా ఉండే ఆ క్యారెక్టర్ కి దర్శకుడు అట్లీ ఇచ్చిన ఫినిషింగ్ చాలా టచింగ్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను దీపికా పదుకునేకు రెగ్యులర్ ఇచ్చే భారీ పారితోషికమే ముట్టజెప్పారనే వార్త ముంబై మీడియా వర్గాల్లో గట్టిగా తిరిగింది.

అయితే అవన్నీ నిరాధారమంటూ దీపికా కొట్టిపారేసింది. జవాన్ కోసం తాను ఒక్క రూపాయి తీసుకోకుండా చేశానని, ఆ క్యారెక్టర్ అంత గొప్పగా ఉండటం వల్ల ఇంకేమి ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. తీసింది షారుఖ్ ఖాన్ స్వంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్. కెరీర్ లో పెద్ద బ్రేక్ ఇచ్చిన ఓం శాంతి ఓం నుంచి దీపికాతో షారుఖ్ కి మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంది. ఆ కారణంగానే ఫ్రీగా చేసి ఉండొచ్చు. డబ్బు రూపంలో తీసుకోకపోయినా ఏదో ఒక రూపేణా కింగ్ ఖాన్ ఇవ్వకుండా అయితే ఉండడు. అందులోనూ ఇంత భారీ బ్లాక్ల్ బస్టర్ అయ్యాక పోనిలే అని వదిలే సమస్యే లేదు.

ఇది దీపికా పదుకునే ఔదార్యమంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. దీని సంగతి సరేకాని ప్రభాస్ తో చేస్తున్న ప్యాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్  కె గురించి అడిగితే మాత్రం అమ్మడు మౌనాన్ని ఆశ్రయిస్తోంది. సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతానని, ఇప్పుడు ఏవేవో చెప్పేసి అభిమానుల్లో ఉన్న ఎగ్జైట్ మెంట్ తగ్గించలేనని కుండ బద్దలు కొట్టింది. టాలీవుడ్ ఎంట్రీ పట్ల మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. జవాన్ లాగే గతంలో 83, సర్కస్ లో ఇష్టపడి నటించిన దీపికా వాటికీ డబ్బులు తీసుకోలేదు. అవి భర్త రణ్వీర్ సింగ్ నటించినవి. కానీ షారుఖ్ కోసం చేయడమంటే విశేషమేగా.

This post was last modified on September 15, 2023 5:14 pm

Share

Recent Posts

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

1 hour ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

2 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

4 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

5 hours ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

6 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

7 hours ago