అదేంటో కొందరికి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ పడ్డా అవకాశాలు రావు. మరికొందరికి మొదటి సినిమా ఫ్లాప్ అయినా మోస్ట్ బిజీ హీరోయిన్ అయిపోతారు. ఫస్ట్ క్యాటగిరీలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని ఉదాహరణగా చెప్పుకుంటే రెండో విభాగంలో శ్రీలీలను ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు. యష్ సరసన రాఖీ భాయ్ భార్యగా తిరుగులేని పాత్ర దక్కించుకున్నా దాని వల్ల శ్రీనిధికి కలిగిన ప్రయోజనం పెద్దగా లేదు. గ్లామర్ ఒలకబోసే పాటలు లేకపోవడం, క్లైమాక్స్ లో చనిపోవడం లాంటి ప్రతికూలతలు ఇతర దర్శకులు తనను ఆప్షన్ గా పెట్టుకోనివ్వకుండా అడ్డుపడ్డాయి.
దీనికన్నా ముందు ఒప్పుకున్న విక్రమ్ కోబ్రా కనీస స్థాయిలో ఆడి ఉంటే కొంత ఊరట దక్కేది. అది డిజాస్టర్ కావడం మరింత దెబ్బ కొట్టింది. దీంతో ఒక్కసారిగా కెరీర్ ఊపందుకునే మార్గాలు తగ్గిపోయాయి. చీకట్లో చిరుదీపంలా ఒక మంచి టాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టిందనే టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ డ్రామాలో జోడిగా తననే ఎంచుకున్నట్టు వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ప్రాధమికంగా జరిగిన చర్చల్లో అంగీకారం జరిగిపోయింది. అఫీషియల్ గా చెప్పడానికి టైం పట్టొచ్చు.
భగవంత్ కేసరి రిలీజయ్యాకే దీని తాలూకు అప్డేట్స్ ని మొదలుపెట్టబోతున్నారు. ఒకవేళ నిజమైతే శ్రీనిధికి మంచి బ్రేక్ గానే చెప్పుకోవచ్చు. క్రేజీ యూత్ స్టార్లు ఆప్షన్ గా పెట్టుకోవడం లేదు కాబట్టి బాలయ్యతో కనక హిట్టు పడితే సీనియర్ల సరసన మరిన్ని ఛాన్సులు వస్తాయి. ఎలాగూ విక్రమ్ తో చేసిన అనుభవం ఉండనే ఉంది. శ్రీనిధికి మరో అడ్డంకి తను మూడు పదుల వయసు దాటేయడం. పాతిక నుంచి ఇండస్ట్రీలో ఉంటేనే బండి వేగంగా ఉంటుంది. అలాంటిది మొదటి హిట్టు పడేనాటికి ముప్పై క్రాస్ అయితే ప్రాక్టికల్ గా ఇదిగో ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతాయి.
This post was last modified on September 15, 2023 9:26 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…