“బిగ్ బాస్ సీజన్ 7” ఊహించినట్టుగానే ఎన్నో సంచలనాలు సృష్టించింది. రేటింగ్స్ పరంగా, వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు “బిగ్ బాస్ సీజన్ 7” వేదిక అయింది. సీజన్ సీజన్ కీ అపూర్వంగా పెరుగుతున్న ఆదరణ ఈ సీజన్ కి వచ్చేసరికి ఎన్నో రెట్లు పెరిగి కొత్త ప్రమాణాలకు తెర తీసింది.
తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ షో చూసి ఆదరించారు. ఇంచుమించు 5. 1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం “బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో ఈ సీజన్ బిగ్ బాస్ ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తిరుగులేని ఈ ప్రేక్షక ఆదరణతో ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న స్టార్ మా… నెంబర్ 1 ఛానల్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
ఈ సీజన్ ఉల్టా పల్టా గా ఉండబోతోంది అని కింగ్ నాగార్జున ప్రోమోలో చెప్పిన నాటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగాయి. అవి ఇప్పుడు ఈ గణాంకాలుగా కనిపిస్తున్నాయి. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ షో కి స్టార్ మా లో మాత్రమే కాదు .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో, యు ట్యూబ్ లో విపరీతమైన ఆదరణ వుంది.
This post was last modified on September 15, 2023 4:48 pm
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…