సరిగ్గా ఇంకో రెండే వారాల్లో స్కంద విడుదల. మూడు పాటలు, ట్రైలర్ రిలీజ్ తర్వాత యూనిట్ హఠాత్తుగా సైలెంటయిపోయింది. ముంబైలో రామ్ పూరి జగన్నాధ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొన్ని సంజయ్ దత్ కాంబినేషన్ సీన్లకు అక్కడ అనుకూల వాతావరణం ఉండటంతో ఆ ఎపిసోడ్లు చకచకా పూర్తవుతున్నాయి. అయితే స్కంద విషయంలో జరుగుతున్న అలసత్వం అతని దృష్టిలో వస్తున్నట్టు లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హీరో అందుబాటులో లేడు సరే దర్శకుడితో సహా టీమ్ మొత్తం దాదాపుగా హైదరాబాద్ లోనే ఉందిగా. ఎందుకు మౌనంగా ఉన్నట్టు.
ఎంత బోయపాటి రామ్ ల బ్రాండ్ ఉన్నా సరే స్కంద విషయంలో కాసింత నెగటివ్ వైబ్స్ బలంగా ఉన్నాయి. షూట్ జరిగినంత కాలం, ఫస్ట్ లుక్ వచ్చిన టైంలో ఏదైతే హైప్ ఉండేదో అది అమాంతం తగ్గిపోయింది. బోయపాటి శీను పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ ఉన్నాడనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది. కొత్తగా మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. బాలకృష్ణ అతిథిగా ప్రీ రిలీజ్ జరిగిన విషయాన్ని జనం మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళది ఫ్రెష్ మెమరీ. మళ్ళీ స్కందని రిజిస్టర్ చేయాలి. ట్రైలర్ విషయంలో వచ్చిన కామెంట్లకు బదులు చెప్పాలి.
ఇంకా టైం ఉంది కదాని నిర్లిప్తంగా ఉంటే లాభం లేదు. రామ్ సెప్టెంబర్ 20లోపే వస్తాడు. అప్పటికప్పుడు హడావిడిగా మీడియా ఇంటర్వ్యూలు వగైరాలు ప్లాన్ చేయొచ్చు. అదొక్కటే సరిపోదుగా. కనీసం ట్విట్టర్ లోనో ఇన్స్ టాలోనో ఏదో ఒక సౌండ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. చంద్రముఖి 2, పెదకాపు 1లు బడ్జెట్, రేంజ్ విషయంలో స్కందతో సమానం కాకపోవచ్చు. అలా అని మరీ తక్కువంచనా వేసినా ప్రమాదమే. అసలు మాస్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ దక్కుతున్న ట్రెండ్ లో స్కందను రామ్ వచ్చే దాకా కదలిక లేకుండా ఉంచడం సరికాదు.
This post was last modified on September 14, 2023 6:15 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…