గత కొన్నేళ్లలో జాతీయ స్థఆయిలో సౌత్ సినిమాల ప్రాబల్యం ఎంతగా పెరిగిందో తెలిసిందే. మన సినిమాలను, మన స్టార్లను ఒకప్పుడు అస్సలు కేర్ చేయని బాలీవుడ్ వాళ్లు.. ఇక్కడి చిత్రాలు, హీరోలు, దర్శకుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. అన్నింటికీ మించి ఇక్కడ హిట్ అయిన సినిమాలన్నింటినీ వాళ్లు చూస్తున్నారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని తమ సినిమాలకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలా పాఠాలు నేర్చుకునే ‘పఠాన్’; ‘జవాన్’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్లు కొట్టాడు షారుఖ్. తన కొత్త చిత్రం ‘జవాన్’ మీద ప్రశంసలు కురిపిస్తూ అల్లు అర్జున్ ట్వీట్ వేసిన నేపథ్యంలో.. దానిపై షారుఖ్ స్పందించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. బన్నీ సినిమా ‘పుష్ప’ను తాను మూడు రోజుల్లో మూడుసార్లు చూసినట్లుగా షారుఖ్ ట్విట్టర్లో పేర్కొనడం విశేషం.
జవాన్ సూపర్ సక్సెస్ కావడంపై టీం మొత్తాన్ని అభినందిస్తూ.. షారుఖ్ స్వాగ్ గురించి ప్రస్తావిస్తూ బన్నీ ట్వీట్ వేశాడు. దీనిపై షారుఖ్ స్పందిస్తూ.. బన్నీని తన మనిషిగా అభివర్ణిస్తూ అతడికి థ్యాంక్స్ చెప్పాడు. తన మీద చూపించిన ప్రేమ తనకెంతో ఆనందాన్నిస్తోందని పేర్కొన్నాడు. స్వాగ్ అనే మాటకు వస్తే ‘ది ఫైర్’ తనను అభినందించిందంటూ ‘పుష్ప’లో బన్నీ చెప్పే ‘ఫైర్’ డైలాగ్‌ను గుర్తు చేశాడు షారుఖ్.
బన్నీ అభినందనలతో తన రోజు గొప్పగా మారిందని అతనన్నాడు. తాను పుష్ప సినిమాను మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు చూశానని.. బన్నీ నుంచి ఒక నటుడిగా తాను కొన్ని విషయాలు నేర్చుకున్నానని పేర్కొంటూ బన్నీకి ఐలవ్యూ కూడా చెప్పాడు షారుఖ్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ ఇప్పటికే రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టింది. బన్నీ త్వరలో అట్లీతో జట్టు కట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో బన్నీ ‘జవాన్’ను పొగడ్డం చర్చనీయాంశమైంది.
This post was last modified on September 14, 2023 3:55 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…