కథ విపరీతంగా నచ్చి నటనకు స్కోప్ ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకోని సాయిపల్లవి చాలా నెలలుగా గ్యాప్ తీసుకుంది. శివ కార్తికేయన్ తో చేస్తున్న ఫాంటసీ మూవీ తప్ప తన చేతిలో ఇంకేవి లేవు. దర్శక నిర్మాతలు ఎందరు కలుస్తున్నా సరే స్టోరీ నచ్చకపోతే ఎంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా నో చెబుతోంది. నాగ చైతన్య 23కి అడిగారని టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాలంటే వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఒక బాలీవుడ్ మూవీకి ఫిదా పోరి పచ్చజెండా ఊపినట్టుగా ముంబై టాక్. అది కూడా ఒక స్టార్ హీరో వారసుడు, కొత్త హీరోతో జట్టు కట్టేందుకు అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.
అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సరసన ఒక లవ్ స్టోరీలో నటించేందుకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సునీల్ పాండే దర్శకత్వంలో ఇది రూపొందనున్నట్టు సమాచారం. ఇతనికి అమీర్ తో చాలా అనుబంధం ఉంది. రంగ్ దే బసంతి నుంచి లాల్ సింగ్ చడ్డా దాకా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ గా, అసోసియేట్ గా పని చేశాడు. ఆ బాండింగ్ తోనే ఒక కథ రాసుకుని జునైద్ ని ఒప్పించడంతో ఇది పట్టాలెక్కుతోందని సమాచారం. అయితే ఆషామాషీగా ఉంటే సాయిపల్లవి ఒప్పుకోదు కాబట్టి కంటెంట్ ఏదో స్ట్రాంగ్ గానే ఉండి ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
జునైద్ దీనికన్నా ముందు యష్ రాజ్ ఫిలిమ్స్ తీయబోయే డెబ్యూ మూవీలో నటిస్తాడు. తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడే రీమేక్ గా ఇది రూపొందుతుందని ఆల్రెడీ చెప్పారు. శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ ని కూడా దీంతోనే లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఏ స్టేజిలో ఉందనే విషయాన్ని మాత్రం గుట్టుగా ఉంచారు. మొత్తానికి సాయిపల్లవి కథ నచ్చాలే కానీ హీరో చిన్నా పెద్దా ఎవరో చూసుకోనని స్పష్టంగా చెప్పేసింది. అయినా కెరీర్ ని మరీ ఇంత నెమ్మదిగా ప్లాన్ చేసుకున్నా నష్టమే. గ్లామర్ రోల్స్ అవసరం లేదనుకుంటే కాస్త స్పీడ్ గా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న వాటినే ఎంచుకోవచ్చుగా.
This post was last modified on September 13, 2023 8:14 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…