అశోక్ సెల్వన్.. తమిళంలో మంచి పేరు సంపాదించిన యంగ్ హీరో. అతను అందగాడే కాదు.. మంచి నటుడు కూడా. మరక్కార్, పొన్నియన్ సెల్వన్, నిన్నిలా నిన్నిలా లాంటి అనువాద చిత్రాలతో అతను తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. విశ్వక్సేన్ సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లో అతను క్యామియో రోల్ కూడా చేశాడు. ఇక తమిళంలో అయితే ‘ఓ మై కడవులే’, ‘పోర్ తొలిల్’ లాంటి మంచి మంచి హిట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఈ యంగ్ హీరో ఓ ఇంటివాడయ్యాడు.
అతను ఒక సినిమా అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన పేరు.. కీర్తి పాండ్యన్. 90వ దశకంలో తమిళ అనువాద చిత్రాలతో పరిచయం ఉన్న వాళ్లకు ఈ పేరు బాగానే తెలిసి ఉంటుంది. కీర్తి.. సీనియర్ నటుడు అరుణ్ పాండ్యన్ తనయురాలు కావడం విశేషం. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కీర్తి పాండ్యన్ సినిమాల్లోకి అడుగు పెట్టింది. కథానాయికగా కొన్ని సినిమాలు చేసింది. మలయాళ హిట్ ‘హెలెన్’ రీమేక్‌లో లీడ్ రోల్ చేసి మెప్పించింది. అశోక్, కీర్తి కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి ‘బ్లూ స్టార్’ అనే సినిమాలో నటించారు. అప్పుడు మొదలైన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది.
కొన్ని నెలల ముందే అశోక్, కీర్తిల పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. ఆ వార్తల్నే నిజం చేస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సినిమా వాళ్ల పెళ్లి అంటే బాగా హడావుడి ఉంటుంది కానీ.. వీళ్లిద్దరూ మాత్రం ఒక గుడిలో సింపుల్‌గా పెళ్ల చేసేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు కొందరు బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. మీడియాకు కూడా వీరి వివాహం గురించి ముందు సమాచారం లేదు. సైలెంట్‌గా పెళ్లాడేసి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి షాకిచ్చారు అశోక్, కీర్తి. అశోక్ ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నాడు.
This post was last modified on September 13, 2023 4:21 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…