Movie News

ప్రభాస్ అభిమానుల ఫ్రస్టేషన్ డబుల్

ఈపాటికి ‘సలార్’ హైప్‌తో ఊగిపోతుండాలి ప్రభాస్ అభిమానులు. ఫ్యాన్స్ అనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. కానీ సెప్టెంబరు 28న రిలీజ్ అంటూ ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించింది చిత్ర బృందం. రిలీజ్ మంత్‌లోకి అడుగు పెట్టామని అభిమానులు సంబరాలకు సిద్ధమైన స్థితిలో ఈ సినిమా వాయిదా వార్తలు వారికి పెద్ద షాకే ఇచ్చాయి. ముందు ఇది రూమర్ అనుకున్నారు కానీ.. ఒక్క రోజు వ్యవధిలో జరిగిన పరిణామాలతో వాయిదా అనివార్యం అని అర్థమైపోయింది.

ఐతే యుఎస్‌లో ప్రిమియర్స్ బుకింగ్స్ ఆపేయడం.. సెప్టెంబరు 28కి వేరే సినిమాలు షెడ్యూల్ కావడం.. ఇలా ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ‘సలార్’ టీం నుంచి మాత్రం సౌండ్ లేదు. కనీసం వాయిదా గురించి వెంటనే అధికారిక ప్రకటన చేసి, వాయిదాకు కారణాలు చెప్పి అభిమానులను శాంతపరిచే ప్రయత్నం కూడా చేయలేదు చిత్ర బృందం.

వాయిదా విషయం ఎప్పుడో తేలిపోయాక ఇప్పుడొచ్చి సెప్టెంబరు 28ను తమ చిత్రం రాలేదని అనౌన్స్‌మెంట్ ఇవ్వడం పుండు మీద కారం చల్లినట్లే అనిపిస్తోంది ప్రభాస్ ఫ్యాన్స్‌కు. వాయిదా గురించి అధికారిక ప్రకటన చేయలేదు అంటే.. కొత్త రిలీజ్ డేట్ మీద కసరత్తు చేస్తున్నారని, ఒకేసారి ఆ ప్రకటనతో తమకు ఉపశమనాన్ని ఇస్తారని ప్రభాస్ అభిమానులు అంచనా వేశారు. కానీ రిలీజ్ కబురే చెప్పకుండా వాయిదా గురించి మొక్కుబడి ప్రకటన చేయడం అవసరమా అంటూ మండిపోతున్నారు.

ఇప్పటికే ఉన్న ఫ్రస్టేషన్ చాలదని.. ఈ ప్రకటనతో అది డబుల్ అవుతోంది. వాయిదా వార్తలు వచ్చినపుడు ప్రశాంత్ నీల్ అండ్ కో మీద కొంతమేరే కోపం చూపించారు. కానీ ఇప్పుడు వారి ఆక్రోశం మరింతగా కనిపిస్తోంది. ప్రశాంత్‌ను, హోంబలె ఫిలిమ్స్ అధినేతలను ప్రభాస్ అభిమానులే ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ మొక్కుబడి ప్రకటన చేయడం కంటే ‘సలార్’ టైం సైలెంట్‌గా ఉండాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

This post was last modified on September 13, 2023 4:19 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago