సౌత్ సెన్సేషన్స్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ త్వరలో మేకప్ వేసుకోబోతున్నారు. ఈ ఇద్దరు ప్రధాన పాత్రల్లో సన్ పిక్చర్స్ ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీని నిర్మించబోతోంది. అయితే డైరెక్షన్ వేరే వాళ్ళు చేస్తున్నారు లెండి. టాప్ ఫైట్ మాస్టర్స్ గా పేరు తెచ్చుకున్న జంట త్రయం అన్బు అరువు ఈ చిత్రంతో మెగా ఫోన్ చేపట్టబోతున్నారు. లియో రిలీజయ్యాక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇది పూర్తి చేశాకే లోకేష్ రజినీకాంత్ 171కి టేకప్ చేయబోతున్నాడు. వినడానికి బాగానే ఉంది.
అసలు సవాల్ ఇకపై ఎదురు కానుంది. ఎందుకంటే టెక్నికల్ గా వీళ్ళెంత గొప్పవాళ్ళయినా కెమెరా ముందు మెప్పించడం అంత సులభం కాదు. తమిళంలో జివి ప్రకాష్ కుమార్ ఇలా రెండు పడవల ప్రయాణంలో సక్సెస్ అయ్యాడు కానీ మరీ పెద్ద రేంజ్ కు చేరుకోలేదు. రెహమాన్, ఇళయరాజా, దేవా లాంటి దిగ్గజాలు ఏదో ఒకటి రెండు ఫ్రేమ్స్ లో కనిపించడం తప్పించి నటించే రిస్కు తీసుకోలేదు. సో అనిరుద్ కి ఇది పెద్ద ఛాలెంజే. ఇక లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే పదేళ్లు హిట్టు లేని కమల్ హాసన్ లాంటి సీనియర్ హీరోకు సైతం బ్లాక్ బస్టర్ ఇచ్చిన ట్రాక్ రికార్డు సొంతం.
మరి అందరికీ ఎలా నటించాలో చెప్పిన లోకేష్ వేరొకరు చెబితే ఎలా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది దృష్టిలో ఉంచుకునే అన్బు అరివులు మంచి పాత్ర సెట్ చేశారట. సరే అనిరుద్ చేతి నిండా భారీ సినిమాలు పెట్టుకుని వాటి ట్యూన్ల కంపోజింగ్ కోసం దర్శకులు ఎదురు చూస్తున్న టైంలో ఇలా నటన పేరుతో కాల్ షీట్లు ఇచ్చుకుంటూ పోతే ఇబ్బందులు రాకపోవు. బ్యాలన్స్ చేసుకోవడం చాలా కష్టం. అసలే జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్టులతో పాటు మరికొన్ని వెయిటింగ్ లో ఉన్నాయి. ఎలా మేనేజ్ చేసుకుంటాడో లెట్ సీ
This post was last modified on September 12, 2023 11:58 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…