సినిమాలో విషయం ఉన్నంత మాత్రాన బాగా ఆడేస్తాయన్న గ్యారెంటీ లేదు. రిలీజ్ టైమింగ్, బాక్సాఫీస్ పరిస్థితులు కూడా కలిసి రావాలి. గత వారం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కొంత ప్రతికూల పరిస్థితుల్లోనే రిలీజైంది. రిలీజ్ ముంగిట ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. పైగా జనమంతా ‘జవాన్’ ఫీవర్లో మునిగిపోయి ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా కనిపించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందో అన్న సందేహాలు కలిగాయి.
కానీ మంచి టాక్‌తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా పుంజుకుంది. ‘జవాన్’ ప్రభంజనాన్ని తట్టుకుని మంచి వసూళ్లే సాధించింది. యుఎస్‌లో తొలి వీకెండ్లోనే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మిలియన్ డాలర్ వసూళ్లు రాబట్టడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు వారాంతంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువగా వచ్చింది.
కంటెంట్ ఉన్న సినిమా సత్తా ఏంటో రుజువు చేస్తూ వీక్ డేస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కూడా దీనికి బాగా కలిసి వస్తున్నాయి. వీకెండ్ తర్వాత ‘జవాన్’ తెలుగు వెర్షన్ జోరు బాగా తగ్గింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’నే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. దీనికి తోడు ఈ వారం రావాల్సిన ‘స్కంద’; ‘చంద్రముఖి-2’ వాయిదా పడిపోయాయి.
‘మార్క్ ఆంటోనీ’ ఓ మోస్తరు బజ్‌తో వస్తోంది. ‘చాంగురే బంగారు రాజా’పై పెద్దగా అంచనాలు లేవు. వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఏమీ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. వినాయకచవితి సీజన్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి బాగా కలిసి వచ్చేలా ఉంది. రెండో వీకెండ్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. నెలలో చివరి వీకెండ్ వరకు ఈ సినిమాకు ఎదురే ఉండకపోవచ్చు. ఫుల్ రన్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేంజికి చేరుతుందేమో.
This post was last modified on September 12, 2023 8:17 pm
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…
డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…