కేవలం నాలుగు రోజుల్లోనే అయిదు వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ ని ఊపేసిన జవాన్ హఠాత్తుగా సోమవారం నుంచి చాలా చోట్ల విపరీతంగా నెమ్మదించాడు. సాధారణంగా మండే డ్రాప్స్ అందరికీ ఉంటాయి కానీ దీనికొచ్చిన టాక్ కి ఇది మరీ తీవ్ర స్థాయిలో ఉండకూడదనేది బయ్యర్ల అభిప్రాయం. ఆదివారం ఒక్క రోజు 70 కోట్లకు పైగా రాబట్టిన షారుఖ్ ఖాన్ నిన్న అమాంతం 40 శాతానికి పైగా తగ్గుదలతో కేవలం 27 కోట్లు వసూలు చేయడం ఆందోళన రేపుతోంది. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ప్రభావం ఉందని అభిమానులు సమర్ధించుకుంటున్నా గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి వేరుగా ఉందట.
మొదటి నాలుగు రోజుల్లోనే మెజారిటీ ఆడియన్స్ జవాన్ ని చూసేశారు. బాగా చల్లబడ్డాక, రద్దీ తగ్గాక థియేటర్లకు వెళదామని ఆగిన న్యూట్రల్ ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అయితే షారుఖ్ వన్ మ్యాన్ షో షో తప్ప కంటెంట్ పరంగా మరీ గొప్పగా ఏం లేదన్న టాక్ ఆలస్యంగా రావడంతో వాళ్ళ నిర్ణయాలపై ఇది ప్రభావం చూపిస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. బాలీవుడ్ మీడియా ఏకంగా 4, 5 రేటింగ్స్ ఇచ్చి కొంచెం ఓవర్ చేసింది కానీ సౌత్ ఇండస్ట్రీ నుంచి మాత్రం మహా అయితే మూడు మించి ఎవరూ సర్టిఫై చేయలేదు.
గతంలో బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లకు ఇలాంటి పరిస్థితి రాలేదు. సండే మండే తేడా లేకుండా కనీసం పది రోజుల నుంచి రెండు వారాల దాకా సాలిడ్ రన్ కొనసాగించాయి. కానీ జవాన్ అంత స్టేజిలో లేదు. పైగా లెక్కల విషయంలో రెడ్ చిల్లీస్ సంస్థ అదనంగా నెంబర్లు కలుపుతోందన్న వాదనలు ముంబై వర్గాల్లో వినిపిస్తున్నాయి. గదర్ 2, పఠాన్ కి సైతం ఇలాగే చేశారని, దక్షిణాదికి ధీటుగా మా సినిమాలు ఆడుతున్నాయని చెప్పుకోవడానికి ఇలా చేస్తున్నారనే కామెంట్స్ లో నిజానిజాలు పెరుమాళ్ళకే ఎరుక. ఇప్పుడు ఎంత స్లో అయినా ఇంకో వీకెండ్ మాత్రం జవాన్ కంట్రోల్ లోకి వచ్చేలా ఉంది.
This post was last modified on September 12, 2023 4:03 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…