Movie News

గదర్-2.. నిజంగా బాహుబలి-2ను దాటిందా?

కరోనా దెబ్బకు రెండు మూడేళ్లు అల్లాడిపోయిన బాలీవుడ్‌కు 2023 సంవత్సరం గొప్ప ఉపశమనాన్నే అందిస్తోంది. మొత్తంగా పరిస్థితి మారిపోయిందని, పూర్వ వైభవం వచ్చేసిందని చెప్పలేం కానీ.. ఈ ఏడాది కొన్ని భారీ విజయాలతో హిందీ చిత్ర పరిశ్రమలో జోష్ వచ్చింది. ఏడాది ఆరంభంలో షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో భారీ బ్లాక్ బస్టర్ అయింది. గత నెలలో ‘గదర్-2’ సెన్సేషనల్ హిట్ కాగా.. ఇటీవలే ‘జవాన్’ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.

ఈ మూడు చిత్రాలు వసూళ్ల పరంగా కొన్ని రికార్డులను సొంతం చేసుకున్నాయి. ఐతే ఈ హిందీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎంత విజృంభించినా.. రాజమౌళి సినిమాల ముందు దిగదుడుపు అన్నట్లే ఉంది పరిస్థితి. ఆరేళ్ల కిందటి ‘బాహుబలి-2’ రికార్డులను ఇప్పటికీ కొట్టలేకపోతున్నాయి. ఓవరాల్ వసూళ్లలో ‘ఆర్ఆర్ఆర్’ను దాటడం కూడా కష్టంగానే ఉంది. ఐతే హిందీ వరకు ‘గదర్-2’; ‘జవాన్’ సినిమాలు కొన్ని రికార్డులను సొంతం చేసుకున్నాయి. ‘గదర్-2’ అయితే ఏకంగా ‘బాహుబలి-2’ రికార్డును బద్దలు కొట్టేసిందంటూ బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు ట్వీట్లు వేస్తున్నారు నిన్నట్నుంచి.

బాహుబలి-2 హిందీ నెట్ వసూళ్లు రూ.512 కోట్లు కాగా.. ‘గదర్-2’ రూ.515 కోట్లతో దాన్ని దాటేసి హైయెస్ట్ హిందీ గ్రాసర్‌గా నిలిచిందని పేర్కొంటున్నారు. ఐతే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు అవసరానికి తగ్గట్లు.. తమ సినిమాలకు అనుకూలంగా గ్రాస్, నెట్ కలెక్షన్లను ప్రకటిస్తుంటారు. నెట్ వసూళ్లలో ‘గదర్-2’.. ‘బాహుబలి-2’ను దాటడం నిజమే కావచ్చు. కానీ గ్రాస్‌లో మాత్రం ‘బాహుబలి-2’దే పైచేయి. రాజమౌళి సినిమా హిందీలో ఏకంగా రూ.725 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ‘పఠాన్’ రూ.640 కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. ‘గదర్-2’ రూ.630 కోట్లతో దానికి చేరువగా మూడో స్థానంలో ఉంది ప్రస్తుతం.

సౌత్ సినిమాలను హిందీలో రిలీజ్ చేస్తే.. డిస్ట్రిబ్యూషన్, ఇతర ఖర్చులు మినహాయిస్తే నెట్, షేర్ చాలా తక్కువ వస్తుంది. అందుకే గ్రాస్‌కు.. నెట్, షేర్‌కు మధ్య అంతరం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ హిందీ సినిమాలకు అక్కడ గ్రాస్, నెట్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉండదు. బాహుబలి-2 గ్రాస్ రూ.725 కోట్లయినా.. నెట్ రూ.512 కోట్లే కాగా.. ‘గదర్-2’ రూ.630 కోట్ల గ్రాసే రాబట్టినా నెట్‌ రూ.515 కోట్లు రావడం ఇందుకు నిదర్శనం. ఇక్కడ నెట్ వసూళ్లను ప్రామాణికంగా తీసుకుని ‘బాహుబలి-2’ను ‘గదర్-2’ దాటేసిందని అంటున్నారు కానీ.. ఓవరాల్ గ్రాస్ విషయంలో మాత్రం ‘బాహుబలి-2’ను ఈ చిత్రమే కాదు.. ఇప్పట్లో మరే సినిమా కూడా కొట్టే పరిస్థితి కనిపించడం లేదు.

This post was last modified on September 12, 2023 2:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

10 minutes ago

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయి – దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…

26 minutes ago

డేటింగ్ రూమర్స్‌పై VD మరో క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…

43 minutes ago

‘హరి హర వీరమల్లు’ నుంచి క్రిష్ తో పాటు ఆయన కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

1 hour ago

డాలర్‌ దెబ్బకు రికార్డు పతనంలో రూపాయి!

రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…

2 hours ago

కేటీఆర్ పై కేసు..అరెస్టు తప్పదా?

బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…

2 hours ago