టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండి ఉన్నట్లుండి చాలా వేగంగా ఫేడవుట్ అయిపోయి, అవకాశాలు అడుగంటిపోయిన దర్శకుడు వి.వి.వినాయక్. చిరు రీఎంట్రీ మూవీ, అందులోనూ రీమేక్ కావడంతో బ్లాక్‌బస్టర్ అయిన ‘ఖైదీ నంబర్ 150’ మినహాయిస్తే గత దశాబ్దంలో వినాయక్ నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచినవే.
ముఖ్యంగా ‘ఖైదీ’కి ముందు వెనుక వచ్చిన అఖిల్, ఇంటిలిజెంట్ సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ‘ఇంటిలిజెంట్’ తర్వాత దర్శకుడిగా వినాయక్ కెరీర్ క్లోజ్ అయినట్లే కనిపించింది. పైగా హీరోగా ‘సీనయ్య’ అనే సినిమాను కూడా మొదలుపెట్టడంతో అందరూ ఆయన కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేసేశారు. ఐతే ఆశ్చర్యకరంగా వినాయక్‌కు మళ్లీ చిరంజీవితో పని చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
ముందు సుజీత్ చేతికి వెళ్లిన ‘లూసిఫర్’ రీమేక్.. అతడి పనితీరు చిరుకు నచ్చక వినాయక్ వైపు మళ్లిన సంగతి తెలిసిందే. ఐతే వెంటనే వినాయక్‌ను కూడా చిరు కన్ఫమ్ చేయలేదు. అతను తన టీంతో కలిసి స్క్రిప్టు ఎలా డెవలప్ చేస్తాడన్నదాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం వినాయక్.. తన వెర్షన్ చిరుకు వినిపించాడట. అది చిరుకు కూడా నచ్చిందట. దీంతో ఫుల్ స్క్రిప్టుతో రమ్మని చిరు చెప్పారట.
వినాయక్‌నే ఈ సినిమాకు దర్శకుడిగా ఖరారు చేసినట్లే అన్నది మెగా కాంపౌండ్ వర్గాల సమాచారం. ‘లూసిఫర్’ పక్కా కమర్షియల్ స్టయిల్లో, ఎలివేషన్లతో సాగే పొలిటికల్ థ్రిల్లర్. సుజీత్ దానికి తన క్రియేటివిటీ జోడించాలని చూశాడో ఏమో కానీ.. చిరును అతను మెప్పించలేకపోయాడు. వినాయక్‌కు ఇలాంటి సినిమాలు డీల్ చేయడం పెద్ద కష్టం కాదు. ఒరిజినల్‌ను ఫాలో అయిపోతూ.. ‘ఖైదీ నంబర్ 150’ తరహాలో ఇంకొంచెం కమర్షియల్ టచ్ ఇస్తే పాసైపోయినట్లే.
This post was last modified on August 22, 2020 10:06 am
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…