నిన్న పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ ప్రకటించడం ఆలస్యం దాని మీద అప్పుడే రకరకాల చర్చలు మొదలయ్యాయి. గతంలో మార్చి 22 రిలీజ్ ఉంటుందనే ప్రచారానికి భిన్నంగా ఏకంగా ఏడాది గ్యాప్ పెట్టుకుని ఫిక్స్ చేయడం చూస్తుంటే దర్శకుడు సుకుమార్ ఈసారి కూడా ఎంత మాత్రం రాజీ పడే ఉద్దేశంలో లేరని అర్థమైపోయింది. పైగా జాతీయ అవార్డు వచ్చింది కాబట్టి మరింత బాద్యతతో సీక్వెల్ ని తీయాల్సి ఉంటుంది. అయితే ఇండియన్ 2 కూడా ఇండిపెండెన్స్ డేకే వస్తుందనే వార్తల నేపథ్యంలో ఇలా అనౌన్స్ మెంట్ ఇవ్వడం ఒకరకంగా లైకా సంస్థను ఇరకాటంలో పెట్టేసింది.
ఇక్కడ ఇంకో ట్విస్టు ఉంది. బాలీవుడ్ స్టార్ మసాలా డైరెక్టర్ రోహిత్ శెట్టి అజయ్ దేవగన్ తో సింగం 3 ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని కూడా ఆగస్ట్ 15 వదిలేలా నిర్మాతలు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే దీని రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తున్నారు. ఒకవేళ దీంతో క్లాష్ వస్తే పుష్ప 2 వసూళ్లకు థియేటర్లకు దెబ్బ పడుతుందనే కోణంలో పలువురు ముంబై విశ్లేషకులు అంచనాలు వేయడం మొదలుపెట్టారు. కానీ వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఇక్కడ టెన్షన్ పడాల్సింది పుష్ప రాజ్ కాదు. ఖచ్చితంగా సింగమే.
ఎందుకంటే పుష్ప రాజ్ అసలు ప్రయాణం రెండో భాగంలోనే ఉంది కాబట్టి హిందీ నుంచి తెలుగు దాకా ఆడియన్స్ కు దాని పట్ల ఓ రేంజ్ లో ఎగ్జైట్ మెంట్ ఉంది. ఊహకందని మలుపులు ఉంటాయని యూనిట్ సభ్యులు తెగ ఊరిస్తున్నారు. అయితే సింగం 3 అటుఇటు తిరిగి ఒక పోలీస్ ఆఫీసర్ కు ఒక విలన్ రాజకీయ నాయకుడికి లేదా డాన్ కు మధ్య జరిగే వార్ లా సాగుతుంది. కంటెంట్ పరంగా పోల్చుకుంటే సింగంలోనే రొటీన్ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అజయ్ దేవగన్ కు ఎంత మార్కెట్ ఉన్నా పుష్ప ఫీవర్ ఊహిస్తున్న దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. సో బన్నీకొచ్చిన ఇబ్బందేమీ లేదు.
This post was last modified on September 12, 2023 12:29 pm
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…