ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో మిగతావన్నీ ఒకెత్తయితే.. నెట్ ఫ్లిక్స్ ఒకెత్తు. పీక్ టైంలో ఆ సంస్థ రోజుకు రూ.200 కోట్ల దాకా ఖర్చు పెట్టి కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుందట. దీన్ని బట్టి దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అక్కడ నిరంతరం కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. దాని గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్ కూడా జరుగుతుంటుంది.
ఐతే త్వరలో నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ కావాల్సిన ఓ సినిమా పోస్టర్లు ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీశాయి. ఆ సినిమాను నిషేధించాలని.. నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ఉద్యమం జరిగే వరకు పరిస్థితి వెళ్లింది.
ఆ సినిమాకు వ్యతిరేకంగా ఒక పిటిషన్ మీద సంతకాల సేకరణ కూడా జరగడంతో నెట్‌ఫ్లిక్స్ అప్రమత్తం అయింది. ఈ సినిమా పబ్లిసిటీ విషయమై ప్రజలకు క్షమాపణ చెప్పింది. దానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం తొలగించింది.
ఇంతటి వివాదానికి కారణమైన సినిమా పేరు.. క్యూటీస్. ఫ్రెంచ్‌లో తీసిన ‘మిగ్నోనెస్’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దీన్ని ఇంగ్లిష్‌లో ‘క్యూటీస్’ పేరుతో వచ్చే నెలలో నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయనుంది. పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌కు చెందిన 11 ఏళ్ల ముస్లిం బాలిక జీవితమే ఈ చిత్రం కథ. కుటుంబ కట్టుబాట్లు.. ఆధునిక, ఇంటర్నెట్ కల్చర్ మధ్య నలిగిపోయే ఓ బాలిక స్వేచ్ఛను కోరుకుంటుంది. ఇందుకోసం ఓ డాన్స్ గ్రూప్‌లో చేరుతుంది. ఆ గ్రూప్‌లో ఉండేది 11-15 ఏళ్ల మధ్య ఉండే బాలికలే. ఈ బాలికల చుట్టూ తిరిగే కథ నడుస్తుంది. ఐతే ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన టీనేజీ అమ్మాయిలతో కూడిన పోస్టర్లను నెట్‌ఫ్లిక్స్ ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ పోస్టర్లు అసభ్యంగా, చిన్నారులను శృంగారానికి ఉసిగొలిపే విధంగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడ్డారు.
ఈ సినిమాను నిషేధించాలంటూ పిటిషన్ మీద సంతకాలు చేశారు. ఐతే నెట్‌ఫ్లిక్స్ వెంటనే అప్రమత్తం అయింది. ప్రోమోల ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్లాయని, వాటిని తొలగిస్తున్నామని.. ఇందుకు మన్నించాలని కోరింది.
This post was last modified on August 22, 2020 10:00 am
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…