పుష్ప 2 కు సంబంధించి బన్నీ ఫ్యాన్స్ కి రిలీజ్ డేట్ అప్ డేట్ ఇచ్చేశారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15 న సెలవలు చూసుకొని డేట్ ఎనౌన్స్ చేశారు. ఈ అన్నీ విధాల కలిసొచ్చేదే అందుకే ఫిక్స్ చేశారని అనుకుంటున్నారందరు. అయితే దీని వెనుక డిలే విషయం కూడా ఉంది. అవును పుష్ప 2 మొదలై చాలా నెలలు గడుస్తుంది. ఇంత వరకూ సుకుమార్ సగం ఘాట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పటి వరకూ 40 శాతం మాత్రమే ఘాట్ జరిగింది.
డిసెంబర్ జనవరి కల్లా టాకీ పార్ట్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ సుక్కు టేకింగ్ కి ఆ డేట్ కి పూర్తవ్వడం కష్టమే అని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప ది రైజ్’ కి వచ్చిన నెగెటివ్ టాక్ , అలాగే నార్త్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ రెండిటినీ దృష్టిలో పెట్టుకొని సుకుమార్ ఇంకా స్లో అండ్ స్టడీ గా సీక్వెల్ తీస్తున్నారట.
అసలే సుక్కు పర్ఫెక్షనిస్ట్. పైగా పుష్ప 2 కి భారీ క్రేజ్ ఉండటంతో ఇంకా ఆలస్యంగా తెరఎక్కిస్తున్నాడట. టీం నుండి కూడా అసలు వచ్చే ఏడాది సమ్మర్ కల్లా షూటింగ్ పూర్తయితే గొప్పే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక బన్నీ కూడా మొన్నటి వరకూ సుకుమార్ ను వీలైనంత ఫాస్ట్ గా సినిమా కంప్లీట్ చేయమని పదే పదే చెప్పాడట. కానీ ఎప్పుడైతే తనకి పుష్పకి గాను నేషనల్ అవార్డ్ దక్కిందో అప్పటి నుండి లేటయినా పర్లేదు అన్నట్టుగా సుక్కుకి ధీమా ఇచ్చాడట.
ఏదేమైనా సుకుమార్ అండ్ టీం ఇప్పటి వరకూ షూటింగ్ జరిగిన డేస్, జరగాల్సిన ఘాట్ ను దృష్టిలో పెట్టుకునే వచ్చే ఏడాది సమ్మర్ కాకుండా ఇంకా వెనక్కి వెళ్ళారని తెలుస్తుంది. సమ్మర్ కి రిలీజ్ అనుకొని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ఇక నెగటివ్ వైబ్ వస్తుందని ఈ లెక్కలన్నీ వేసుకున్నాకే ఆగస్ట్ 15 కి ఫిక్స్ అయ్యారట. మరి చెప్పినట్టే వచ్చే ఏడాది ఆగస్ట్ నుండి పుష్ప తన రూల్ చూపిస్తాడా ? చూడాలి.
This post was last modified on September 12, 2023 9:25 am
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…