ఒక నటుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కేవలం తన టాలెంట్‌తో హీరోగా నిలదొక్కుకోవడం.. తనకంటూ ఒక ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇందుకోసం ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి ఉంటుంది. కానీ అలా కష్టపడి ఎదిగిన వాళ్ల మీద ప్రేక్షకుల్లో ప్రత్యేక అభిమానం ఉంటుంది. నవీన్ పొలిశెట్టి ఈ కోవకు చెందిన నటుడే.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా మారడానికి ముందు నవీన్ సినీ పరిశ్రమలో డక్కా మొక్కీలు తిన్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’; ‘1 నేనొక్కడినే’ లాంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేశాడు. ఇంకేవో చిన్న చిన్న పాత్రలు చేశాడు. వాటితో పాటే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేశాడు. అతను చేసిన హిందీ షార్ట్ ఫిలిమ్స్ ఉత్తరాదిన తనకు గుర్తింపు తెచ్చాయి. ఐతే తెలుగులో బ్రేక్ అందుకోవడానికి మాత్రం చాలా టైం పట్టింది.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో తన టాలెంట్ ఏంటో చూపించి హీరోగా తొలి సక్సెస్ అందుకున్న నవీన్‌కు ‘జాతిరత్నాలు’ ఇంకా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అతను లీడ్ రోల్ చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సైతం మంచి విజయాన్నందుకుంది. ఏ బ్యాగ్రౌండ్ లేని నటుడు.. హీరోగా ఇలా వరుసగా మూడు సక్సెస్‌లు అందుకోవడం అరుదైన విషయమే. ఐతే ఈ మూడు సినిమాలు చేయడానికి నవీన్‌కు ఆరేళ్లు పట్టేసింది. సినిమాకు సినిమాకు మధ్య రెండేళ్ల విరామం వచ్చింది.
కాస్త ఫేమ్ రాగానే ఎడా పెడా సినిమాలు ఒప్పేసుకుని పేరు చెడగొట్టుకోకుండా.. ఇలా ఆచితూచి అడుగులు వేయడం మంచిదే. కానీ కెరీర్లో నిలదొక్కుకోవడానికి చాలా ఏళ్లు పట్టిన నేపథ్యంలో నవీన్ ఇకపై స్పీడ్ పెంచాల్సిందే. తన కెరీర్లో పతాక స్థాయిని అందుకున్న అతను.. దాన్ని ఉపయోగించుకుని ఇక గ్యాప్ లేకుండా సినిమాలు చేయాల్సిన అవసరముంది. నవీన్ కొత్త చిత్రంపై ఇంకా ప్రకటన అయితే రాలేదు. సాధ్యమైనంత త్వరగా దాన్ని ఓకే చేసి.. ఇక చకచకా సినిమాలు చేయాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on September 11, 2023 7:11 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…