కరోనా వైరస్ ధాటికి మూతపడ్డ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేకపోవడం.. కనీసం ఆరు నెలల పాటు థియేట్రికల్ రిలీజ్‌లపై సినిమాలు ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని స్పష్టమవుతుండటంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో నేరుగా రిలీజ్ చేసేసే ప్రతిపాదన గురించి ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది.
కాస్త పేరున్న సినిమాలేవీ ఇప్పుడిప్పుడే ఇలాంటి సాహసాలు చేయకపోవచ్చని టాలీవుడ్ పెద్దల మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఐతే చిన్న సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ గురించి మరీ ఎక్కువ ఆలోచించకుండా ఓటీటీల వైపు వెళ్లిపోవడం ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమృతారామమ్ అనే ఓ చిన్న సినిమా ఈ దిశగానే అడుగులు వేసింది. ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు.
ఈ నెల 29న జీ5లో అమృతారామమ్‌ను ప్రిమియర్‌గా వేయబోతున్నారు. సురేందర్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా మామూలు పరిస్థితులుండుంటే ఈపాటికి థియేటర్లలో రిలీజయ్యేది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కూడా తీసుకుంది. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో ఆ డీల్ రద్దయినట్లుంది.
మళ్లీ థియేటర్లు తెరుచుకునేదాకా ఎదురుచూడ్డం కంటే ఈ చిన్న సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఐతే అంతకంటే ముందు తమిళంలో ఒక స్థాయి ఉన్న సినిమానే నేరుగా అమేజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తోంది.
ఈ సినిమా పేరు.. పొన్ మగళ్ వందాల్ (అమ్మాయి వచ్చింది). ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్, సూర్య సతీమణి జ్యోతిక ప్రధాన పాత్ర పోషించింది. జేజే ఫ్రెడరిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరిందరు పేరున్న నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ చేసేస్తున్నారు.
This post was last modified on April 25, 2020 12:19 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…