బాలీవుడ్ మాస్ కి నిజమైన నిర్వచనం ఇస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఒకే ఏడాదిలో రెండు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ సాధించడమే కాక నాలుగు రోజులు వరసగా రోజుకో వంద కోట్లకు పైగా సాధించిన ఏకైక హీరోగా కొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న ఇండియా పాకిస్థాన్ మ్యాచ్, పలుచోట్ల వర్షాలతో కూడిన ముసురు వాతావరణం, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి ఇవేవి బాద్షా ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. దాదాపుగా నిన్న షోలన్నీ హౌస్ ఫుల్ కావడమే కాక చాలా చోట్ల బీసీ సెంటర్లలో టికెట్లు దొరక్క వెనక్కు తిరిగిన ప్రేక్షకులు లక్షల్లో ఉంటారని ప్రత్యక్షంగా చూసిన బయ్యర్లు చెబుతున్నారు.
ట్రేడ్ నుంచి అందిన ప్రాధమిక సమాచారం మేరకు జవాన్ ఇప్పటిదాకా 531 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. ఇంత వేగంగా అర సహస్రం దాటిన మూవీగా మరో మైలురాయి అందుకుంది. వరసగా నాలుగు రోజులు 125, 109, 140, 156 కోట్లను కొల్లగొడుతూ పోయిన షారుఖ్ ఈ నెంబర్లను బట్టే ఎంత అరాచకం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. లెక్కల్లో కొన్ని స్వల్ప మార్పులు ఉండొచ్చేమో కానీ ఈ పరిణామాలు నార్త్ ట్రేడ్ లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. గత నెల గదర్ 2 బాక్సాఫీస్ ని కళకళలాడించగా ఇప్పుడు జవాన్ అంతకు మించి అనేలా దాన్ని ఒక్క వీకెండ్ లోనే దాటేసింది.
జవాన్ సెట్ చేసిన రికార్డులు చూసి మతులు పోతున్నాయి. ఏదో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ అయితే ఏదో అనుకోవచ్చు. ఎన్నో పాత కథలను తీసుకుని కిచిడి చేసి దర్శకుడు అట్లీ ఊర మాస్ గా ప్రెజెంట్ చేసిన ఒక కమర్షియల్ సినిమా ఇన్ని అద్భుతాలు చేయడం గొప్ప విషయం. చాలా ఏళ్లుగా ,మరుగునపడిన షారుఖ్ అసలు స్టామినాని బయటికి తీయడంతో ప్రేక్షకులు వెర్రెక్కిపోతున్నారు. ఈ దూకుడు ఇంకో రెండు వారాలు ఈజీగా కొనసాగుతుందని డిస్ట్రిబ్యూటర్ల అంచనా. వెయ్యి కోట్లు కన్ఫర్మ్ కానీ అది ఎప్పటి లోపే, ఫైనల్ గా ఎక్కడ ఆగుతుందనేది ఊహకందని విషయం.
This post was last modified on September 11, 2023 12:16 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…