గత గురువారం రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా సక్సెస్ అవుతుందని చాలామందికి నమ్మకాలు లేవు. ఎందుకంటే ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడింది. రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ కనిపించలేదు. పైగా ‘జవాన్’ లాంటి క్రేజీ మూవీతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడి నెగ్గుకు రావడం చాలా చాలా కష్టంగానే అనిపించింది. కానీ కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎలా నెత్తిన పెట్టుకుంటారో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ రుజువు చేసింది.
ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ హీరో నవీన్ పొలిశెట్టికి దక్కుతుందని చెప్పడంలో మరో మాటే లేదు. ఈ సినిమాను తన పెర్ఫామెన్స్‌తో నిలబెట్టింది నవీనే. కథాకథనాల్లో కంటెంట్ ఉన్నప్పటికీ.. నవీన్ లాంటి పెర్ఫామర్ సిద్ధు పాత్రను చేయకపోయి ఉంటే ఈ సినిమా ఇంత ఎంటర్టైనింగ్‌గా ఉండేది కాదన్నది స్పష్టం. తన పెర్ఫామెన్స్‌తో, జోకులతో సినిమాలో ఎక్కడా జోష్ తగ్గకుండా చూసుకున్నాడు.
ఐతే తన పాత్రను పర్ఫెక్ట్‌గా చేయడంతో సరిపోదు. సినిమాను ప్రమోట్ చేయడంలో అతను చూపించిన చొరవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అనుష్క ప్రమోషన్లకు అందుబాటులో లేకుండా సింగిల్ హ్యాండెడ్‌గా అతను ప్రమోషన్లను నడిపించాడు. రిలీజ్ ముందు కొన్ని రోజుల వరకు అతను అనేక ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఇంటర్వ్యూలిచ్చాడు. కాలేజీలు తిరిగాడు. ఆంధ్రా ప్రాంతానికి కూడా వెళ్లి సినిమాను ప్రమోట్ చేశాడు. అంతటితో ఆగకుండా నవీన్.. రిలీజ్ టైంకి యుఎస్‌లో ల్యాండ్ అయ్యాడు.
అక్కడ అనేక ఈవెంట్లలో పాల్గొన్నాడు. అభిమానులతో కలిసి ప్రిమియర్ షోలకు హాజరయ్యాడు. ఇలా విరామం, విశ్రాంతి లేకుండా అతను సినిమా ప్రమోషన్లను ఒంటి చేత్తో ముందుకు నడిపించాడు. యుఎస్‌లో నవీన్ ప్రమోషన్ వసూళ్లకు బాగా కలిసొచ్చింది. ‘జవాన్’ ప్రభంజనం మధ్య వీకెండ్లోనే మిలియన్ మార్కును సినిమా టచ్ చేస్తోందంటే చిన్న విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా చాలా బాగా ఆడుతోంది. ఆదివారం హౌస్ ఫుల్స్ నమోదవుతున్నాయి. ఒక పాత్రను ఎలా పండించాలనే కాదు.. ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలనే విషయంలో కూడా నవీన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచాడనడంలో సందేహం లేదు.
This post was last modified on September 11, 2023 12:18 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…