గత ఏడాది తెలుగులో వచ్చిన డీసెంట్ హిట్లలో ‘రాక్షసుడు’ ఒకటి. తమిళంలో రెండేళ్ల కిందట సెన్సేషనల్ హిట్టయిన ‘రాక్షసన్’ను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ రీమేక్ చేశాడు. ఒరిజినల్‌ను యాజిటీజ్‌గా దించేసినప్పటికీ.. కథలో ఉన్న బలం, కథనంలో ఉన్న ఉత్కంఠ వల్ల తెలుగులోనూ ఈ సినిమా బాగానే ఆడింది. ఈ మధ్యే ఈ చిత్ర వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా ‘రాక్షసుడు’కు తెలుగులో సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అదెంత వరకు నిజమో కానీ.. ఇప్పుడు మాత్రం ‘రాక్షసుడు’ రీమేక్ గురించి అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని హిందీలోకి తీసుకెళ్తున్నారు. తెలుగు వెర్షన్‌ను నిర్మించిన కోనేరు సత్యనారాయణనే హిందీ రీమేక్‌ను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దర్శకుడు రమేష్ వర్మనే. రమేష్ పుట్టిన రోజును పురస్కరించుుకుని మీడియాకు ఈ అప్ డేట్ ఇచ్చారు.
‘రాక్షసుడు’ సక్సెస్ తర్వాత రమేష్‌కు రవితేజతో సినిమా చేసే అవకాశం దక్కింది. ఐతే ఆ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు. అది పూర్తి చేసిన తర్వాత రమేష్ హిందీ ‘రాక్షసుడు’ను డైరెక్ట్ చేస్తాడట. ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఇందులో లీడ్ రోల్ చేస్తాడట. తెలుగు వెర్షన్ విషయానికి వస్తే రమేష్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు యాజిటీజ్ దించేశాడు. కాపీ-పేస్ట్ వ్యవహారంలా అనిపించిందది. కొన్ని సన్నివేశాలైతే ఒరిజినల్ నుంచి అలాగే తీసి పెట్టేశారు కూడా. ఇప్పుడు హిందీ వెర్షన్ తీయడంలోనూ రమేష్‌కు పెద్దగా శ్రమ లేకపోవచ్చు. ఏదైనా బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని టేకప్ చేస్తే.. మార్పులు చేర్పులు, మేకింగ్‌లో వాళ్ల టచ్ ఇవ్వడానికి చూసేవాళ్లు. కానీ హిందీలో కూడా తెలుగు నిర్మాతే ప్రొడ్యూస్ చేయడంతో రమేష్ పని తేలికే కావచ్చు. కాకపోతే వీళ్లను నమ్మి హిందీలో ఈ సినిమా చేసే స్టార్ ఎవరన్నదే ప్రశ్న.
This post was last modified on August 22, 2020 4:09 am
ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ…
ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల…
శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమై తన గ్లామర్ తో కుర్ర కారు…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపజేసిన లెజెండ్స్ జీవితాలను తెరమీద చూపించే ప్రయత్నం మహానటితో మొదలయ్యింది. అది సాధించిన…
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…