మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకుడిగా కెరీర్ పీక్స్ ని ఎంజాయ్ చేస్తున్న అనిరుద్ రవిచందర్ ఇటీవలే జైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కావాలయ్యా పాట ఏ రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్టయ్యాయో చూస్తాం. బిజిఎం ఏ మాత్రం బాలన్స్ తప్పినా తెరమీద నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్ నీరసంగా కనిపించేది. బక్కోడని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే అనిరుద్ కరెక్ట్ గా డ్యూటీ చేస్తే అవుట్ ఫుట్ ఆ రేంజ్ లో ఉంటుంది. అయితే జవాన్ ఎంత ఇండస్ట్రీ హిట్ దిశగా పరుగులు పెడుతున్నా మ్యూజిక్ విషయంలో మాత్రం యునానిమస్ గా బెస్ట్ అనే రిపోర్ట్స్ రాని మాట వాస్తవం. గొప్పగా అనిపించే క్యాచీ ట్యూన్లు పడలేదు.
ఇతర బాష కాబట్టి అలా అయ్యుండొచ్చనే కామెంట్ నిజం కాదు. ఎందుకంటే పని చేయించుకుంది తమిళ దర్శకుడే. పైగా వీళ్ళ కలయిక మొదటిసారి కాదు. అలాంటప్పుడు తేడా ఎక్కడ కొట్టింది. జిందా బందా తెరమీద గొప్పగా వచ్చింది కానీ దాంతో సహా మిగిలినవన్నీ ఆడియో పరంగా రిపీట్ వేల్యూ ఉన్నవి కాదు. ఇప్పుడీ టాపిక్ ఎందుకంటారా. జూనియర్ ఎన్టీఆర్ దేవరకు ఇంకా ట్యూన్స్ ఫైనల్ కాలేదు. మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న కొరటాల శివ అనిరుద్ నుంచి బెస్ట్ రాబట్టుకోవడం పెద్ద సవాలే. తెలుగులో అజ్ఞాతవాసి, జెర్సిలాంటి స్ట్రెయిట్ ఆల్బమ్స్ చేసినా అవి ఎవర్ గ్రీనని చెప్పుకునే స్థాయిలో రాలేదు.
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరికి పని చేస్తోంది కూడా అనిరుదే. ప్రస్తుతానికి రెగ్యులర్ షూటింగ్ జరగడం లేదు కానీ ముందైతే సిట్టింగ్స్ పూర్తి చేసుకుని పాటలు సిద్ధంగా పెట్టుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. కానీ అనిరుద్ అంత సులభంగా దొరకడం లేదు. ఒకరకంగా శివ, గౌతమ్ లకు అవుట్ ఫుట్ రాబట్టుకోవడం అంత సులభం కాదు. పైగా చెన్నైలో ఉండే అతగాడిని మాటికి హైదరాబాద్ తీసుకురాలేరు. వచ్చినప్పుడే పిండేసుకోవాలి. చేతి నిండా సినిమాలతో తెగ బిజీగా ఉన్న కుర్ర సంచలనంతో కనక కోరుకున్న ఫలితం రాబట్టుకుంటే మాత్రం భారీగా ముట్టజెప్పిన పారితోషికానికి న్యాయం జరుగుతుంది.
This post was last modified on September 10, 2023 4:27 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…