Movie News

కృష్ణ అండ్ హిజ్ లీల హీరోయిన్ పెళ్ల‌యిపోయింది

థియేట్రిక‌ల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజైన తెలుగు సినిమాల్లో అతి పెద్ద హిట్ అంటే.. కృష్ణ అండ్ హిజ్ లీల‌లోనే. అందులో లీడ్ క్యారెక్ట‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. వాటిని పోషించిన ఆర్టిస్టులూ మెప్పించారు. ఈ చిత్రంలో రాధ పాత్ర‌లో మెరిసిన కొత్త‌మ్మాయి షాలిని వ‌డ్నిక‌ట్టి. సంప్ర‌దాయంగా క‌నిపిస్తూనే గ్లామ‌ర్‌తోనూ ఆక‌ట్టుకున్న ఈ అమ్మాయి.. ఎంతోమందిని త‌న అభిమానులుగా మార్చుకుంది. ఈ అమ్మాయి ఉన్న‌ట్లుండి త‌న పెళ్లి క‌బురుతో వార్త‌ల్లోకి వ‌చ్చింది.

శుక్ర‌వారం షాలిని.. మ‌నోజ్ బీద అనే కుర్రాడిని పెళ్లాడింది. క‌రోనా నిబంధ‌న‌ల మ‌ధ్య త‌క్కువ‌మంది అతిథులతో వీరి పెళ్లి జ‌రిగింది. మ‌నోజ్ ఓ ద‌ర్శ‌కుడు కావ‌డం విశేషం. ఈ కుర్రాడు త‌మిళంలో వంజ‌గ‌ర్ ఉలగం అనే సినిమా తీశాడు. జోక‌ర్ సినిమాతో గొప్ప ప్ర‌శంస‌లందుకున్న గురు సోమసుంద‌రం ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఓ విభిన్న‌మైన సినిమాగా ఈ సినిమాకు పేరొచ్చింది. ఆ త‌ర్వాత మ‌నోజ్ నుంచి సినిమా రాలేదు. షాలినితో కొన్నేళ్లుగా మ‌నోజ్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాడు. షాలిని విష‌యానికి వ‌స్తే.. ఆమె ప్ల‌స్ అనే క‌న్న‌డ సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచయం అయింది.

ఆ త‌ర్వాత క‌న్న‌డ‌తో పాటు త‌మిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో యురేక‌తో ఆమె క‌థానాయిక‌గా ప‌రిచయం అయింది. కానీ పేరొచ్చింది మాత్రం కృష్ణ అండ్ హిజ్ లీల‌తోనే. ఈ సినిమా చూసి షాలినికి మంచి భ‌విష్య‌త్తుంద‌ని.. హీరోయిన్‌గా మంచి రేంజికి వెళ్తుంద‌ని అనుకుంటే.. ఉన్న‌ట్లుండి లా పెళ్లి ముచ్చ‌ట‌తో షాకిచ్చింది.

This post was last modified on August 21, 2020 9:38 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago