మంచి విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా భక్త కన్నప్పను ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు రెండు వందల కోట్లతో తీస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అసలు స్వీట్ అండ్ షాక్ న్యూస్ మరొకటి వచ్చింది. ప్రభాస్ ని ఒక ప్రత్యేకమైన క్యామియో కోసం అడిగితే తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అది మహాశివుడి క్యారెక్టరేనని విశ్వసనీయ సమాచారం. సోషల్ మీడియాలో పలువురు ట్వీట్లు పెడితే వాటిలో ఒకదానికి విష్ణు స్పందిస్తూ హరహరమహాదేవ్ అంటూ రీ కోట్ చేయడంతో న్యూస్ నిర్ధారణ అయినట్టేనని చెప్పాలి.
ఎంత సేపు ఉంటాడు, విష్ణు ప్రభాస్ కలయికలో ఎలాంటి సన్నివేశాలు వస్తాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. డార్లింగ్ దీని మీద ఆసక్తి చూపించడానికి రెండు ప్రత్యేక కారణాలున్నాయి. పెదనాన్న కలల ప్రాజెక్ట్ భక్త కన్నప్ప. తనతోనే తీయాలని చాలా బలంగా కోరుకున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు విష్ణుతో అది సాధ్యమవుతోంది కాబట్టి కనీసం అందులో పాత్ర చేయడం ద్వారా అయినా కృష్ణంరాజు గారి కోరికని ఈ రకంగా నెరవేర్చిన సంతృప్తి మిగులుతుంది. పైగా మోహన్ బాబు కుటుంబంతో ప్రభాస్ ఫ్యామిలీకు ఎంతో సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.
ఒక్కసారిగా కన్నప్ప నేషనల్ వైడ్ టాక్ అయిపోయింది. ప్రభాస్ వచ్చేశాడు కాబట్టి స్కేల్ పెరుగుతుంది. రెండు వందలు కాదు ఇంకో వంద కోట్లు ఎక్స్ ట్రా పెట్టినా సరే ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. కాకపోతే డార్లింగ్ నిడివి ఎంత ఉంటుందనేది కీలకంగా మారనుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎపిక్ డ్రామాలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది విడుదల ప్లాన్ చేసుకుంటున్న కన్నప్పకి ఒక కీలక షెడ్యూల్ విదేశాల్లో చేయబోతున్నారు. సెట్ వర్క్ తో పాటు విఎఫెక్స్ భారీగా ఉండబోతున్న ఈ గ్రాండియర్ లో మిగిలిన క్యాస్టింగ్ ని ప్రకటించాల్సి ఉంది
This post was last modified on September 10, 2023 12:52 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…