ఏ ఇండస్ట్రీలో అయిన సక్సెస్ ఉంటేనే గుర్తింపు దక్కుతుంది. లేదంటే ఎంత టాలెంట్ ఉన్నా పట్టించుకోరు. తాజాగా టాలీవుడ్ లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఓ దర్శకుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. విషయంలోకి వెళితే.. అనుష్క , నవీన్ పొలిశెట్టి జంటగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ థియేటర్స్ లో మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. తొలి రోజు జవాన్ ఎఫెక్ట్ తో మంచి ఓపెనింగ్ మిస్ అయినా రెండో రోజు నుండి పుంజుకుంది. వీకెండ్ లో ఈ సినిమా మంచి వసూళ్లు సాదించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ దాటేసి 1 మిలియన్ డాలర్ వైపుగా వెళ్తుంది.
ఈ సినిమాకు దర్శకుడు మహేష్ బాబు. గతంలో ఈ దర్శకుడు సందీప్ కిషన్ తో ‘రారా కృష్ణయ్య’ అనే సినిమా చేశాడు. దాని రిజల్ట్ తెలిసిందే. ఆ మూవీ తర్వాత కొన్నేళ్ళు కష్టపడి ఓ సెన్సిబుల్ కథ రెడీ చేసుకొని యూవీ క్రియేషన్స్ ను అప్రోచ్ అయ్యాడు. తర్వాత అనుష్క ,నవీన్ పోలిశెట్టి లను తన కథతో ఒప్పించాడు. వారిద్దరికీ ఉన్న ఏజ్ గ్యాప్ కథకి బాగా కలిసొచ్చింది. వీర్య దానం కాన్సెప్ట్ ను క్లీన్ ఎంటర్టైనయింగ్ గా తెరకెక్కించి మహేష్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. రాజమౌళి వంటి దిగ్గజం కూడా మహేష్ వర్క్ ను సోషల్ మీడియా ద్వారా మెచ్చుకున్నాడు.
ఒక ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకొని ఇప్పుడు బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా మహేష్ బాబు టాలీవుడ్ లో జెండా పాతేశాడు. తన సెన్సిబుల్ కామెడీ రైటింగ్ తో ప్రేక్షకులను హిలేరియస్ గా నవ్విస్తూ మంచి వసూళ్లు రాబడుతున్న ఈ దర్శకుడికి ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ నెక్స్ట్ సినిమా కూడా యూవీలోనే చేసే ఛాన్స్ ఉంది.
This post was last modified on September 10, 2023 12:20 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…