Movie News

శెట్టి జోడి ఇంకొంచెం ఆగి ఉంటే

జవాన్ ప్రభంజనంలోనూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆశించిన దానికన్నా మెరుగ్గా వసూళ్లు రాబట్టడం ట్రేడ్ ని సంతోషంలో ముంచెంత్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్, నైజామ్ కలెక్షన్లు చాలా బాగున్నాయి. మాస్ సెంటర్స్ లో షారుఖ్ ఖాన్ ఆధిపత్యం వల్ల కొంత వెనుకబడి ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్సే లేని ఇలాంటి జానర్ తో ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభం కాదు. నవీన్ పోలిశెట్టి హ్యూమర్, అనుష్క కంబ్యాక్ కోసం ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వస్తున్నారు. మల్టీ ప్లెక్సుల ఆక్యుపెన్సీలు మార్నింగ్, మ్యాట్నీలకు సైతం బాగుండటం శుభ సంకేతంగా చెప్పుకోవాలి.

అయితే ఒక్కటి మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్తవముంది. ఒకవేళ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కనక కొంచెం ఆగి జవాన్ ని తక్కువంచనా వేయకుండా ముందో వెనకో రిలీజ్ ప్లాన్ చేసుకుని ఉంటే ఫిగర్స్ ఇంకా భారీగా ఉండేవి. సెప్టెంబర్ 15 వినాయక చవితి పండక్కు డబ్బింగ్ సినిమా మార్క్ ఆంటోనీ తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇది కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుంది కాదు. చంద్రముఖి 2 ఆల్రెడీ తప్పుకుంది. స్కంద నెలాఖరుకు వెళ్ళింది. సో ఫెస్టివల్ స్లాట్ ఊరికే వృధా అయిపోయింది. ఆపై వారం కూడా చెప్పుకోదగ్గ విడుదల ఏదీ లేదు. సో శెట్టి జోడికి భలే ఛాన్స్ దక్కేది.

ఇలా కాకుండా సెప్టెంబర్ 1న నేరుగా ఖుషితో క్లాష్ అయినా పోలిశెట్టి డామినేట్ చేసేదన్న కామెంట్ లోనూ నిజం లేకపోలేదు. జవాన్ ని కేవలం ఒక బాలీవుడ్ మూవీగా చూడటం వల్ల వచ్చిన ఇబ్బందిది. నవీన్ అనుష్క జంటను జనం బాగా రిసీవ్ చేసుకున్నారన్న విషయం వసూళ్లు చూస్తే అర్థమైపోయింది కాబట్టి పరిస్థితులను అవగాహన చేసుకోవడంలో వచ్చిన లోపం వల్ల ఎంతలేదన్నా ఓ పాతిక ఎం ముప్పై శాతం తక్కువ ఫిగర్లతోనే సర్దుకోవాల్సి వచ్చింది. నిన్నటి నుంచి జవాన్ కు స్క్రీన్లు పెరిగాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి డిమాండ్ ఉన్నా పూర్తిగా సర్దలేని పరిస్థితి. ఆచితూచి అడుగులు అవసరమన్నది అందుకే మరి. 

This post was last modified on September 9, 2023 4:51 pm

Share

Recent Posts

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

22 minutes ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

50 minutes ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

12 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

12 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

13 hours ago