మలయాళంలో రెండేళ్ల కిందట సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘నాయట్టు’. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వ్యక్తులు.. ఆ వ్యవస్థ చేతిలో ఎలా పావులుగా మారతారో.. బలిపశువులు అవుతారో చూపించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్‌గానూ మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా రిలీజైన కొంత కాలానికే తెలుగు రీమేక్ తెరపైకి వచ్చింది.
గీతా ఆర్ట్స్ వాళ్లు హక్కులు కొని.. కరుణ్ కుమార్ దర్శకత్వంలో రీమేక్‌ను అనౌన్స్ చేశారు కూడా. రావు రమేష్, ప్రియదర్శి, అంజలిల కాంబినేషన్లో ఈ సినిమా తీయాలనుకున్నారు. షూటింగ్ షెడ్యూళ్లు కూడా వేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. సినిమా ముందుకు కదల్లేదు. తర్వాత అందరూ ఈ సినిమా గురించి మరిచిపోయారు. కట్ చేస్తే.. పూర్తిగా కొత్త టీంతో ఈ ఏడాది సినిమాను పట్టాలెక్కించారు. ‘కోటబొమ్మాళి పీఎస్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. కానీ ముందు అనౌన్స్ చేసిన కాస్ట్‌తో పోలిస్తే ఇప్పుడు నటీనటులు అంత ఎగ్జైటింగ్‌గా అనిపించడం లేదు. మలయాళంలో జోజు జార్జ్ చేసిన పాత్రకు రావు రమేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితేనే బాగుండేది. ఆయన పెర్ఫామెన్స్ కూడా ఈ సినిమాకు ఎసెట్ అయ్యేదేమో. కానీ ఆయన్ని కాదని శ్రీకాంత్‌ను పెట్టారు.
అతను మంచి నటుడే అయినా.. జోజు పాత్రకు ఏమాత్రం సూటవుతాడనే సందేహాలున్నాయి. పైగా శ్రీకాంత్ ఇప్పుడు ఫాంలో లేడు. రావు రమేష్ ఉంటే ఒక వైవిధ్యం కనిపించేది. అలాగే ప్రియదర్శి, అంజలి లాంటి పెర్ఫామర్లు చేస్తే ఆయా పాత్రలు బాగా ఎలివేట్ అయ్యేవి. ఇంకా నటులుగా నిలదొక్కుకోని రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఈ క్యారెక్టర్లను ఏమాత్రం నిలబెడతారన్నది సందేహం. కాకపోతే కథలో ఉన్న బలం.. యువ దర్శకుడు తేజ మర్ని పనితనం ఈ సినిమాను సక్సెస్ చేస్తుందేమో చూడాలి.
This post was last modified on September 9, 2023 2:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…