దర్శకుడు శంకర్ బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ లో ఒకటైన భారతీయుడు కొనసాగింపు ఇండియన్ 2 షూటింగ్ ఒక కొలిక్కి వస్తోంది. మొత్తం పూర్తి కాలేదు కానీ కీలక భాగాలన్నీ షూట్ చేసినట్టు తెలిసింది. ముందు దీన్ని రెండు భాగాలుగా తీయాలని అనుకున్నప్పటికీ కమల్ హాసన్ సలహా మేరకు ఒక పార్ట్ కే పరిమితం చేశారు. దానికి అనుగుణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది లైకా సంస్థ. ఒకపక్క రామ్ చరణ్ గేమ్ చేంజర్ తీస్తూనే మరోవైపు దీనివైపు ఫోకస్ పెట్టాల్సి రావడంతో రెండూ ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్లలేక ఆలస్యమవుతూ వచ్చాయి. తాజా అప్డేట్ కొంత ఊరట నిచ్చేలా ఉంది.
ఇండియన్ 2 విడుదలని వచ్చే సంవత్సరం ఆగస్ట్ 15కి లాక్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు చెన్నై టాక్. ఇది గురువారం వస్తుంది. అంటే నాలుగు రోజుల సుదీర్ఘమైన వీకెండ్ బాగా ప్లస్ అవుతుంది. టాక్ బాగుంటే కనక మొన్న గదర్ 2 లాగా సంచలనాత్మక వసూళ్లను రాబట్టుకోవచ్చు. ఎలాగూ అంచనాలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి హిట్ కొడితే మాత్రం విక్రమ్ రికార్డులు చెల్లాచెదురు కావడం ఖాయం. ముందు వేసవి రిలీజ్ అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం అవసరం కావడంతో శంకర్ బెస్ట్ ఆప్షన్ గా ఇండిపెండెన్స్ డేని ఎంచుకున్నారట.
ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ కు శుభవార్తే. ఎందుకంటే ఇండియన్ 2 క్లారిటీ వచ్చేసింది కాబట్టి గేమ్ చేంజర్ ని ఎప్పుడు వదలాలనేది నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. 2024 సమ్మర్ బెస్ట్ ఆప్షన్ కావొచ్చు. మార్చి మూడో వారంలో పుష్ప 2 ది రూల్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో దేవర ఉంటాయి కాబట్టి వాటితో క్లాష్ లేకుండా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా షూటింగ్ లోనే ఉన్న ఈ మెగా మూవీని ఎప్పుడు పూర్తి చేస్తారో బయటికి చెప్పడం లేదు. డిసెంబర్ లోగా అయిపోతుందనే మాట సన్నిహిత వర్గాల్లో వినిపిస్తోంది. ఏదో ఒకటి త్వరగా తేల్చి చెప్పేస్తే ఫ్యాన్స్ కి ఒక పెద్ద సస్పెన్స్ తీరిపోతుంది.
This post was last modified on September 9, 2023 11:46 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…