సెప్టెంబర్ 28న రావల్సిన ‘సలార్’ రిలీజ్ వాయిదాతో ఉన్నపాలంగా ఆ డేట్ హాట్ కేక్ ళా మారింది. ప్రభాస్ సినిమా పోస్ట్ పోన్ సంగతి తెలిసిన వెంటనే నిర్మాత నాగవంశీ తన సంస్థ నుండి వస్తున్న చిన్న సినిమా ‘మ్యాడ్’ ను ఆ డేట్ కి ఎనౌన్స్ చేశాడు. ఆ వెంటనే కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ కి కూడా అదే డేట్ లాక్ చేసుకున్నారు. ఇక రెండ్రోజుల డిస్కషన్ తర్వాత రామ్ ‘స్కంద’ కూడా 15 నుండి 28 కి వెళ్ళింది.
ఇప్పుడు రామ్ బాటలోనే లారెన్స్ కూడా తన చంద్రముఖి2 రిలీజ్ డేట్ ను మార్చుకున్నాడు. ఈ సినిమా ఈ నెల 15న తమిళ్ , తెలుగులో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ టెక్నికల్ డిలే పేరుతో సినిమాను మళ్ళీ 28 కి వాయిదా వేసుకొని ఆఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. నిజానికి జవాన్ ఎఫెక్ట్ వల్లే చంద్రముఖి 2 వాయిదా పడిందని, షారూఖ్ సినిమాకి తెలుగు , తమిళ్ లో వస్తున్న వసూళ్లు చూశాక మేకర్స్ తమ సినిమాను ఇంకో వారానికి పోస్ట్ పోన్ చేసుకున్నారని టాక్.
ఏదేమైనా సలార్ డేట్ ను గట్టిగా క్యాష్ చేసుకోవాలని చూసిన రామ్ ‘స్కంద’ కి ఇప్పుడు లారెన్స్ ‘చంద్రముఖి 2’ పోటీ వచ్చిపడింది. హారర్ కథతో వాసు తీసిన ఈ సీక్వెల్ ను తక్కువ అంచనా వేయలేము. రజినీ చంద్రముఖికి సీక్వెల్ , పైగా లారెన్స్ నుండి హారర్ సినిమా కావడంతో తెలుగులో కూడా ఈ సినిమాపై అంచనాలున్నాయి. మాస్ వర్సెస్ హారర్ అంటూ రామ్ , లారెన్స్ పోటీ పడి బాక్సాఫీస్ వద్ద ఎన్ని వసూళ్లు రాబడతారో ?
This post was last modified on September 9, 2023 12:49 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…